/rtv/media/media_files/2024/12/01/a0fNqqPAOxGVW2xUBdIX.jpg)
కేరళలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మలప్పురం జిల్లాలోని వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఒకేసారి 10 మందికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. అయితే ఆ 10 మంది వ్యక్తులు ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 10 మందిలో ఏడుగురు కేరళ వాసులు కాగా.. మరో ముగ్గురు వివిధ రాష్ట్రాలకు చెందినవారు అని వైద్యారోగ్య శాఖ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఐవీ సోకిన వారు డ్రగ్స్ తీసుకునేవారని కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే అందరూ ఒకే ఇంజెక్షన్ సిరంజీని ఉపయోగించడం వల్ల వారంతా హెచ్ఐవీ బారిన పడినట్లు తేల్చారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also Read: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!
మరో 9 మంది డ్రగ్స్...
మలప్పురం జిల్లా వాలంచెరి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన తర్వాత.. ఈ హెచ్ఐవీ సోకిన వారంతా డ్రగ్స్‌కు బానిసలు అయ్యారని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదటగా ఈ 10 మందిలో ఒకరికి ఎయిడ్స్ సోకగా.. అతడు ఉపయోగించిన ఇంజెక్షన్ సిరంజీని మరో 9 మంది డ్రగ్స్ తీసుకునేందుకు ఉపయోగించారని.. అందుకే వారందరికీ హెచ్ఐవీ సోకినట్లు వెల్లడించారు. ఈ ఎయిడ్స్ సోకిన వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు అని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు హెచ్ఐవీ సోకిన 10 మంది వ్యక్తులను అధికారులు తమ పర్యవేక్షణలో పెట్టుకున్నారు.
Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
2025 జనవరిలో కేరళ ఎయిడ్స్ కంట్రోల్ అసోసియేషన్ వాలంచెరి మున్సిపాలిటీ ప్రాంతంలో మొట్టమొదట ఒక హెచ్ఐవీ రోగిని గుర్తించింది. ఈ కేసు బయటపడిన తర్వాత.. కేరళ ఆరోగ్య శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయటికి వచ్చాయి. హెచ్ఐవీ సోకిన వ్యక్తి ఉపయోగించిన సిరంజీని మరో 9 మంది కూడా ఉపయోగించడంతో ఎయిడ్స్ వ్యాప్తి చెందినట్లు తేలింది. ఇక దర్యాప్తులో భాగంగా వారి మెడికల్ రిపోర్ట్‌లు వచ్చినపుడు.. కేరళ ఆరోగ్య శాఖ అధికారులు షాక్ అయ్యారు.
మెడికల్ టెస్ట్‌లలో వారందరికీ హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో డ్రగ్స్ తీసుకునే వారిలో హెచ్ఐవీ సంక్రమణ పెరిగే ప్రమాదం ఉందని మలప్పురం జిల్లా వైద్యాధికారి ఆర్. రేణుక హెచ్చరికలు చేశారు. వాలంచేరిలో హెచ్‌ఐవీ సోకిన 10 మంది మాదకద్రవ్యాలకుకు బానిసలు అని.. దీనివల్ల వారి కుటుంబాలకు కూడా ఎయిడ్స్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందని.. హెచ్ఐవీ సోకిన కుటుంబాలను వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.
Also Read: Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
Also Read: Crime News: కుక్క టాయిలెట్ పోసిందని.. కారుతో గుద్దేశాడు!
kerala | malapuram | hiv | aids | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates