Gudivada Amarnath: ఆంధ్రాలో కాదు.. అమెరికాలో నిరసన తెలిపినా శిక్ష తప్పదు.! చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 19 Sep 2023 in వైజాగ్ రాజకీయాలు New Update షేర్ చేయండి చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నిందితుడిగా తెలాడన్న ఆయన.. అందుకే చట్టం అతన్ని జైలుకు పంపిందన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని, తప్పు చేసిన వారిని వదలదని స్పష్టం చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం, పార్టీల ప్రమేయం ఉండదన్నారు. తప్పు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టు బడ్డాడు కాబట్టే చంద్రబాబును పోలీసులు రిమాండ్‌కు తరలించారన్నారు. చంద్రబాబు కోసం లోకేష్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్న మంత్రి అమర్నాథ్.. తండ్రి కోసం కొడుకు అమెరికా వెళ్లినా ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు శిక్ష అనుభవించి తీరుతాడని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తప్పు చేసిన వ్యక్తికి టీడీపీ నేతలు మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు తప్పును టీడీపీ నేతలు సైతం ఒప్పుకుంటున్నట్లే అవుతుందన్నారు. దీంతో టీడీపీ పార్టీనే అవినీతి పార్టీగా మారిందని గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటూ బాబు చేసిన అవినీతి బయటపడిందని ఫైర్ అయ్యారు. మరోవైపు చంద్రబాబు చేసిన తప్పుల్లో ఒకటి మాత్రమే బయటపడిందన్న ఆయన.. ఇంకా బయట పడనివి ఎన్ని ఉన్నాయే అని అనుమానం వ్యక్తం చేశారు, చంద్రబాబు చేసిన అవినీతి గురించి ప్రజలకు తెలిసి పోయిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలు జన్మలో టీడీపీకి ఓటు వేయరన్నారు. చంద్రబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిందేనని మంత్రి ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పాటు ఇతర పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేవన్నారు. 2024లో ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన.. జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. #lokesh #ycp #tdp #delhi #chandrababu #cm-jagan #janasena #minister #america #britain #skill-development #gudiwada-amarnath #imprisonment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి