ముంచుకొస్తున్న మిచౌంగ్ ముప్పు.. పలు విమానాలు, రైళ్లు రద్దు మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. By srinivas 04 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Cyclone Michaung Effect: మిచౌంగ్ తుపాను దక్షిణ కోస్తాను అతలాకుతం చేస్తోంది. పశ్చిమ బంగాళాఖాతంలో వాయు గుండంగా ఏర్పడిన తుపాను కేవలం 24 గంటల్లోనే తీవ్ర రూపం దాల్చగా చెన్నై, తిరుపతి (Tirupathi), తదితర ప్రాంతాలు జలయమమయ్యాయి. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. నగరంలోని పలు పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో శరవేగంగా జాగ్రత్తలు చేపట్టిన అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే పలు విమానాలు (Flights), రైళ్లను (Trains) రద్దు చేశారు. CS MICHAUNG lay centered over Westcentral & adjoining Southwest Bay of Bengal off south Andhra Pradesh and adjoining north Tamilnadu coasts about 110 km east-northeast of Chennai, 190 km southeast of Nellore, 210 km northeast of Puducherry, 310 km south-southeast of Bapatla and — India Meteorological Department (@Indiametdept) December 4, 2023 ఈ క్రమంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండగా విజయవాడ-విశాఖ ఇండిగో విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తిరుపతి జిల్లా రేణిగుంటకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా రద్దు చేశారు. దీంతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కొందరు బెంగళూరు, మరికొందరు చెన్నైకి వెళ్లి అక్కడినుంచి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఉదయం హైదరాబాదు నుంచి రేణిగుంటకు వచ్చే స్పైస్‌జెట్, ఇండిగో విమానాలు కాస్త ఆలస్యంగా వచ్చాయి. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 142 రైళ్లు రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ మీదుగా గ్రాండ్ మెయిన్ ట్రంక్ లైన్ మీద రాకపోకలు సాగించే రైళ్లను భారీ సంఖ్యలో రైల్వే శాఖ రద్దు చేసింది. శనివారం రాత్రి 7 గంటల సమయానికి మొత్తం 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లా : గూడూరు మిచౌంగ్ తుఫాను ప్రభావంతో గూడూరు డివిజన్ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహంలో చిక్కుకున్న కారు వెంకటగిరి నుండి నెల్లూరుకు కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం కారులో ఉన్న వారిని రక్షించిన స్థానికులు.#Tirupati pic.twitter.com/5VQO9kHNS6 — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) December 4, 2023 Also read :నేడే సీఎల్పీ సమావేశం.. సీఎం ఆయనేనా? ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో (Dec 3-6) తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరారు. విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్‌లను కూడా రద్దు చేశారు. విజయవాడ నుంచి న్యూఢిల్లీ వెళ్లే దురంతో సూపర్‌ఫాస్ట్ కూడా రద్దయ్యింది. విజయవాడ-చెన్నై వెళ్లే పినాకిని, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, విజయవాడ-గూడూరు, నర్సాపూర్-కొట్టాయం, కాకినాడ టౌన్-తిరుపతితోపాటు సికింద్రాబాద్-విజయవాడ, లింగంపల్లి-విజయవాడ మధ్యన నడిచే అనేక రైళ్ల రాకపోకలు ఆపేశారు. సికింద్రాబాద్ - విశాఖ, విజయవాడ-బెంగళూరు మధ్యన నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి. ఇక మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) ప్రభావంతో గూడూరు డివిజన్ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వెంకటగిరి నుండి నెల్లూరు కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం ఈ వరదల్లో చిక్కుకుపోయింది. విషయం గమనించిన స్థానికులు వారిని రక్షించారు. #tirupati #chennai #trains #tamilnadu #flights #vishakapatnam #cyclone-michaung మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి