/rtv/media/media_files/2025/01/16/ANpG5iX4CSuNd9UCXPBo.jpg)
sperm doner Photograph: (sperm doner)
Sperm Donor: ఓ వ్యక్తి 87 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అవును.. మీరు చదివింది నిజమే. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన స్పెర్మ్ డోనర్‌గా పిలువబడే కైల్ గోర్డీ(Kyle Gordy) 2025 చివరి నాటికి 100 మంది పిల్లలకు తండ్రైయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన కైల్ గోర్డీ ప్రెగ్నెన్సీ అందక ఇబ్బంది పడుతున్న మహిళలకు ఉచితంగా స్పెర్మ్ డొనేట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు గోర్డీ 87 మంది పిల్లలు కనడానికి వీర్యకణాలను దానం చేశాడు. ఇతను బి ప్రెగ్నెంట్ నౌ అనే వెబ్‌సైట్ ద్వారా గర్భదాల్చడానికి కష్టమవుతున్న లేడీస్‌కు ఫ్రీగా స్పెర్మ్ డొనేట్ చేస్తున్నాడు.
Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి
Prolific sperm donor Kyle Gordy will soon have fathered 101 children in countries around the world.https://t.co/aUVvyb5eIm
— NewstalkFM (@NewstalkFM) January 15, 2025
Also Read : సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!
దేశానికి ఓ బిడ్డను పుట్టించాలని లక్ష్యంగా..
స్వీడన్, నార్వే, ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లో గోర్డీ దానం చేసిన వీర్యంతో 14 పెండింగ్ గర్భాలు ఉన్నాయి. గోర్డీ ఈ సంవత్సరం 100 మంది పిల్లలను తండ్రి అవుతాడు. గర్భదాల్చడానికి ఇబ్బందులు పడుతున్న వారికి, పిల్లలు అవసరమైన వారికి సహాయం చేయాలనే లక్ష్యంగా అతను పని చేస్తున్నాని మీడియాతో అన్నాడు. ఇప్పటి వరకు 87 మందికి పైగా గర్భాలకు స్పెర్మ్ డొనేట్ చేసిన నలుగురు వ్యక్తుల్లో గోర్డీ ఒకరు.
Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
కొంతకాలం తర్వాత గోర్డీ జపాన్, ఐర్లాండ్, కొరియా సహా ఇతర దేశాల్లో స్పెర్మ్ డొనేట్ చేయాలని భావిస్తున్నాడు. మహిళలను ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవడంలో తాను సహాయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని గోర్డీ అన్నాడు. 2026 నాటికి తనకు అవకాశం వస్తే ప్రతి దేశానికి ఓ బిడ్డను పుట్టించవచ్చేమో అని విలేఖరులతో గోర్డీ అన్నాడు.