/rtv/media/media_files/2025/03/27/FDf8eWwePuSKDAtdO8ZV.jpg)
Ugadi 2025
Ugadi 2025: దక్షిణ భారతదేశంలో ఉగాది పండుగను నూతన సంవత్సర వేడుకగా జరుపుకుంటారు. ఉగాది పండుగను హిందూ క్యాలెండర్ ప్రకారం.. చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఇది ప్రధానంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరుపుకుంటారు. ఈ రోజున హిందూ మతంలో చైత్ర నవరాత్రి కూడా ప్రారంభమవుతుంది. మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరం.. ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది అంటే కొత్త బట్టలు వేసుకోవడం, ఆలయాలను సందర్శించడంతో పాటు షడ్రుచుల ఉగాది పచ్చడిని కూడా తీసుకుంటూ ఉంటాం. అయితే ఉగాది రోజు కొన్ని రంగుల దుస్తులు వేసుకుంటే ఏడాది మొత్తం మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఎరుపు రంగు దుస్తులతో మంచి ఫలితాలు:
ఈ ఏడాది ఉగాది ఆదివారం వచ్చినందుకు ద్వాదశ రాశులు ఉన్నవారు.. 27 జన్మ నక్షత్రాలు కలిగిన వారంతా ఎరుపు రంగు దుస్తులు ధరించాలని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఎరుపు రంగు బట్టలు లేకపోతే గోల్డ్, గోధుమ కలర్ బట్టలు వేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇలా ధరించడం వల్ల ఏడాది మొత్తం అనుకున్న పనులు జరుగుతాయని, మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అదే విధంగా ఉగాది రోజు కొన్ని దేవాలయాలను సందర్శించడం శుభప్రదం. ఆదివారానికి అధిపతి సూర్యుడు. కాబట్టి సూర్యభగవానుడి ఆలయానికి వెళ్తే మంచిది. సూర్య దేవాలయానికి వెళ్లలేని వారు ఉప ఆలయాలకు వెళ్లినా ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: శరీరానికి ఫైబర్ అధికంగా ఉండాలా..? ఈ ఆహారాలు ట్రై చేయండి
అది కూడా కుదరకపోతే స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రటి పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేసి తూర్పువైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12 సార్లు చెప్పి సూర్యుడికి సమర్పించాలి. ఇలా చేసినా లాభాలు పొందవచ్చని పండితులు అంటున్నారు. మరో మార్గం ఏంటంటే సూర్యుడికి ఇష్టదైవం శ్రీమన్నారాణయ ఆలయాన్ని సందర్శించాలని, రామాలయం, నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నా మంచి జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఉగాది రోజున గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. గోమాతకు నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి తినిపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: రాత్రిపూట బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినండి
( ugadi-special | ugadi-festival | ugadi-pachadi | latest-news)