/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)
🔴Live News Updates:
Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్ లో 24 మంది!
మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది.
/rtv/media/media_files/2025/04/02/BuoiEqiDz0OK6YKSAgYC.jpg)
మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. షెగావ్-ఖామ్‌గావ్ జాతీయ రహదారిపై ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు.
Also Read: Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే
వెంటనే క్షతగాత్రులను ఖామ్‌గావ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వేగంగా వస్తున్న బొలెరో కారు, ఎస్టీ బస్సు అకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఆ తర్వాత వెనుక నుండి వస్తున్న 'ప్రి' ప్యాసింజర్ బస్సు కూడా ఈ రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, 24 మంది గాయపడ్డారు.
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
Buldhana, Maharashtra: A triple accident on Shegaon-Khamgaon Highway involving a Bolero, an ST bus, and a private bus killed five people and injured 24. The injured are receiving treatment at Khamgaon government hospital pic.twitter.com/dIWmrwPEN9
— IANS (@ians_india) April 2, 2025
జీరో పాయింట్ వద్ద
అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో, ఢిల్లీ-లక్నో హైవేపై, రాత్రి జీరో పాయింట్ వద్ద, అదుపుతప్పిన ట్రక్కు ఒక కారును ఢీకొట్టి దాదాపు 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలో కారు కూడా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలు మృతి చెందారు. డ్రైవర్ సహా ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. కారులో ఉన్న వారందరూ నైనిటాల్ సందర్శించడానికి వెళ్లి రోహ్తక్లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
-
Apr 02, 2025 21:21 IST
దారుణంగా టెస్లా అమ్మకాలు...మూడేళ్ల కనిష్టానికి..
-
Apr 02, 2025 21:20 IST
మయన్మార్ లో మరోమారు భూకంపం.. ఈసారి నష్టం...
-
Apr 02, 2025 15:22 IST
బీసీ రిజర్వేషన్ పై ఇక ధర్మయుద్ధమే...ఢిల్లీ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Apr 02, 2025 14:24 IST
Summer Air Cooler Offers: ఎయిర్ కూలర్ కొంటున్నారా.. ఈ ఆఫర్లపై ఓ లుక్కేయండి
అమెజాన్ వేసవిలో కూలర్లపై ఆఫర్లు ప్రకటించింది. బజాజ్ ఫ్రియో 23L న్యూ పర్సనల్ కూలర్ రూ.4,899కి కొనుక్కోవచ్చు. కెన్‌స్టార్ పల్స్ HC 20 పోర్టబుల్/రూమ్/పర్సనల్ కూలర్ రూ.రూ.3,990కి, హావెల్స్ కల్ట్ ప్రో 17L పర్సనల్ ఎయిర్ కూలర్‌ను రూ.4,099కే సొంతం చేసుకోవచ్చు.
summer air cooler offers Photograph: (summer air cooler offers) -
Apr 02, 2025 10:26 IST
WhatsApp: వాట్సాప్ దెబ్బ యూజర్లు అబ్బ.. ఏకంగా 97 లక్షల అకౌంట్స్ ఫసక్- మీరూ జాగ్రత్త!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో ఏకంగా 97లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. అందులో ఫిర్యాదులు రాకముందే దాదాపు 14లక్షల ఖాతాలపై చర్యలు తీసుకుంది. తప్పుదోవ పట్టించే ఖాతాలను ఏఐ టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిని తొలగించింది.
WhatsApp banned 97 lakh accounts in India Photograph: (WhatsApp banned 97 lakh accounts in India ) -
Apr 02, 2025 10:25 IST
Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!