Earthquake in Japan : జపాన్ ను వణికించిన భూకంపం...రిక్టర్‌ స్కేల్‌పై ఎంతంటే...

బుధవారం (ఏప్రిల్ 2) జపాన్‎లోని క్యుషులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా  భూమి కంపించింది. గత జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది.

New Update
Earthquake in Japan

Earthquake in Japan

Earthquake in Japan : వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్‎లాండ్ దేశాలను భారీ భూకంపం గడగడలాడించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి మయన్మార్ శ్మశాన వాటికను తలపిస్తోంది. దాదాపు 3 వేల మంది మరణించారు. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండగా.. వారి కోసం సహకయ చర్యలు  కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే.. బుధవారం (ఏప్రిల్ 2) జపాన్‎లోని క్యుషులో భారీ భూకంపం సంభవించింది.

Also Read:  Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా  భూమి కంపించింది. గత జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: తినడం, తాగడం వల్ల కూడా గొంతు నొప్పి వస్తుందా?

ఏఎఫ్‌పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్‌లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని,  మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.

Also Read: Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి
 
కాగా, ఇటీవల మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్‌లో సంభవించిన భూకంపం థాయిలాండ్‌లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది.

Also Read :  చర్మం, జుట్టును రక్షించే అద్భుతమైన ఆయుర్వేద ఉత్పత్తులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UK: ఇజ్రాయెల్‌లో బ్రిటన్ ఎంపీలు నిర్బంధం..

ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తింది.

New Update
Two UK MPs denied entry to Israel

Two UK MPs denied entry to Israel

ఇజ్రాయెల్-, హమాస్‌ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలకు బిగ్ షాక్ తగిలింది. అక్కడి అధికారులు వాళ్లిద్దరినీ అడ్డుకొని నిర్బంధించారు. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్ ప్రభుత్వం మండిపడింది. ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ధ్వజమెత్తారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్, అబ్తిసామ్ మొహమ్మద్ ఇద్దరూ కూడా శనివారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

అక్కడికి చేరుకున్నాక అధికారులు వాళ్లని అడ్డుకొని నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అయితే భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచడం కోసమే ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసింది. అందుకే వాళ్ల రాకను అధికారులు అడ్డుకున్నారని చెప్పింది. సమాచారం లేకుండానే ఇక్కడికి ఎలా వచ్చారని ప్రశ్నించింది. అయితే ఇజ్రాయెల్ చర్యలపై యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: శ్రీలంకలో ప్రధాని మోదీ.. 11 మంది భారత జాలర్లు విడుదల

డేవిడ్ లామీ మాట్లాడుతూ '' ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు యూకే ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది సరైంది కాదు. వాళ్ల చర్య ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వాళ్లు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు చెప్పాను. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని'' అన్నారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

telugu-news | rtv-news | britain | israel | hamas-israel | hamas-israel-war

 

#telugu-news #rtv-news #britain #israel #hamas-israel #hamas-israel-war
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు