/rtv/media/media_files/2025/04/07/n8De1S3jA6aGm3ncKOZX.jpg)
Sugarcane Juice
Sugarcane Juice: చెరకు రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వేసవిలో చెరకు రసం ఎక్కువగా తీసుకుంటారు. చెరకు రసం ఆరోగ్యానికే కాదు, అందానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు అంటున్నారు. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో చెరకు రసం చాలా మంచిది. దీనికోసం చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. ఈ పేస్ట్‌లోని సమ్మేళనాలు చర్మ కణాలను పునరుజ్జీవింపజేస్తాయని నిపుణులు అంటున్నారు. చెరకు రసంలో కొంచెం తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై పావుగంట పాటు మసాజ్ చేయాలి. దీన్ని ఇరవై నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.
చర్మాన్ని కాంతివంతం:
దీన్ని వారానికి రెండుసార్లు చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. కాఫీ పొడిలో కొంచెం చెరకు రసం కలపండి. ఈ పేస్ట్‌ను స్క్రబ్‌గా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చెరకు రసం, నిమ్మరసం, ద్రాక్ష రసం, ఆపిల్ రసం, కొబ్బరి పాలు సమాన మొత్తంలో తీసుకుని వాటిని బాగా కలిపి చర్మానికి పూయండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి చెరకు రసంతో తయారు చేసిన ఐస్ క్యూబ్‌లను ఉపయోగించవచ్చు. బొప్పాయి గుజ్జును చెరకు రసంతో కలిపి అప్లై చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి?
2 టీస్పూన్ల నెయ్యిని 4 టీస్పూన్ల చెరకు రసంతో కలిపి చర్మానికి మసాజ్ చేసి తర్వాత సూర్యరశ్మికి గురికావడం వల్ల టాన్ అయిన చర్మం తిరిగి మెరుపును పొందుతుంది. ఒక లీటరు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు, పావు లీటరు చెరకు రసం కలిపి మరిగించాలి. ఈ ఆవిరిని పీల్చడం వల్ల చర్మం శుభ్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఎలాంటి పదార్థాలు కలపకుండా స్వచ్ఛమైన చెరకు రసాన్ని చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుందని నిపుణులు అంటున్నారు. చెరకు రసాన్ని జుట్టుకు రాసి గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే డి జుట్టు తిరిగి సిల్కీ మెరుపును పొందుతుంది. చెరకు రసాన్ని జుట్టుకు సహజ కండిషనర్‌గా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!
( sugarcane-juice | sugarcane-juice-benefits | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )