/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Obesity-8-scaled.jpg)
India 80 percent Obesity
Obesity: అధిక బరువు పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. దేశంలో సగానికిపైగా జనం ఓవర్‌వెయిట్‌లో అష్టకష్టాలు పడుతున్నారు. జంక్ ఫుడ్ కారణంగానే ఇండియాలో 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రవరం అయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
హార్మోన్ల మార్పుల కారణం..
జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా దేశంలో చాలామంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. బాడీ ఊహించని రీతిలో బరువెక్కుతోంది. ముఖ్యంగా యుక్తవయస్సు వారిలో ఊబకాయ సమస్య అధికంగా కనిపిస్తోంది. కేవలం 20 ఏళ్లు ఉన్న వ్యక్తికే పొట్ట ముందుకు వస్తుండటం ఆందోళన కలిగించే అంశమే. అయితే ఆహార అలవాట్లు, హార్మోన్ల మార్పుల కారణంగా ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. పిండి పదార్థాలు, షుగర్ ఐటెమ్స్, కొవ్వు, జంక్‌ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. శారీరక శ్రమ తగ్గించారు. బద్దకం, మానసిక ఒత్తిడి పెరిగింది. దీంతో సరిగ్గా నిద్రలేకపోవడం, సామాజిక ఆర్థిక స్థితిగతులు, పర్యావరణ అంశాల వంటివి ఎన్నో ఊబకాయానికి దారితీస్తున్నాయని వైద్యులు తెలిపారు.
Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..
ఐటీ సెక్టార్‌లో 80 శాతం మంది..
ఇక ఐటీ సెక్టార్‌లో వందకు 80 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో బాడీ ఫ్యాట్ పెరిగిపోయింది. అధికశాతం మంది ఐటీవారే ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే అధిక బరువు సమస్యను తగ్గించుకోవడం తేలికవుతుంది. లేదంటే ఒబేసిటీ వల్ల చాలా సమస్యలు ఏర్పడే అవకాశముంది. ముఖ్యంగా ఊబకాయం వల్ల చురుకుదనం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్, జీర్ణసమస్యలు, హైకొలెస్ట్రాల్, సంతానలేమి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
Also read : దత్తత తీసుకున్నోళ్లకు దూరమై.. కట్టుకున్నోడి చేతిలో హతమై.. ఆ మేనమామే లేకుంటే..!
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఊబకాయం సమస్యను నివారించవచ్చు. సమయానికి అవసరమైనంత ఆహారం తీసుకోంటే అధిక బరువు సమస్య ఉండదు. రోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం ద్వారా బాడీలో పేరుకున్న కేలరీలను కరిగించవచ్చు. పిండి, కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. ఎక్కువగా ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే ఒబేసిటీ సమస్యలు రాకుండా ఉంటాయి. రోజుకు 6-8 గంటల నిద్రపోవాలి. ఎక్కువసేపు కూర్చొకుండా కాస్త తిరుగుతూ పనులు చేయాలి. ఇలా చేస్తే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. రైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?