Eye Tips
Eye Tips: కళ్లు చాలా సున్నితమైన అవయవం. ఒక చిన్న దుమ్ము ధూళి కళ్లలో పడితే అది గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. కళ్లలో మంట, విపరీతమైన నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. చాలా మంది కళ్లలో దుమ్ము పడినప్పుడు దానిని తొలగించడానికి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకుంటారు. కొన్నిసార్లు ఏమి చేసినా దుమ్ము కణాలు పోవు. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
చెత్తను తొలగించవచ్చు:
కంటిలో నలక పడితే దానిని తొలగించడానికి కళ్లలో నీళ్లు చల్లుకోవచ్చు. నీటిని ఫోర్స్‌గా కడుక్కుంటే కంటిలోని దుమ్ము కణం లేదా చెత్త బయటకు వస్తాయి. దుమ్ము కణాలు పెద్దగా ఉంటే తెరిచి ఉన్న కళ్లలో నెమ్మదిగా నీటిని పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటి లోపలి నుండి చెత్తను తొలగించవచ్చు. కంటిలో నలకపడితే త్వరగా రెప్పవేయడం వల్ల చిన్న దుమ్ము కణాలు బయటకు వస్తాయి. పెద్ద దుమ్ము కణాలు ఉంటే రెప్ప వేసిన వెంటనే అవి కనురెప్పలోకి చొచ్చుకుపోతాయి.
ఇది కూడా చదవండి: తండ్రికి డయాబెటిస్ ఉంటే బిడ్డకు కూడా వస్తుందా?
ఇలా జరిగినప్పుడు కనురెప్పను తెరిచి సన్నని కాటన్ వస్త్రాన్ని ఉపయోగించాలి. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా చక్కెర కలిపి ఈ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే నలక తొలగిపోతుంది. ఇంట్లో గేదె నెయ్యి ఉంటే దానిని వేడి చేసి వడకట్టి కళ్లలో రెండు చుక్కలు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటిలోని నలకలు తొలగిపోతాయి. అంతేకాకుండా కళ్లలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనె వేయడం వల్ల నలక తొలగిపోవడమే కాకుండా కళ్లు కూడా శుభ్రం అవుతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్‌తో లాభముందా?
( health-tips | latest health tips | best-health-tips | latest-news)