/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-14-6.jpg)
Doctors key tips on 5 Sexually transmitted diseases
Sex Health: శృంగారం జీవుల్లో సాధారణ ప్రక్రియ. అయితే కొంతమందికి దీనిపై మోజు ఉంటుంది కానీ అవగాహన ఉండదు. ముఖ్యంగా లైంగిక సంబంధాల నుంచి సక్రమించే వ్యాధుల గురించి దాదాపు 90 శాతం మందికి తెలీదు. నిర్లక్ష్యం కారణంగా తీవ్రమైన సుఖవ్యాధులు, ఆనారోగ్య సమస్యల పాలవుతుంటారు. కొన్ని ఇన్ఫెక్షన్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే సంభవించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా STD (Sexually transmitted disease)కి సకాలంలో చికిత్స చేయకపోతే అది వంధ్యత్వం, దీర్ఘకాలిక నొప్పి సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. మీరు లైంగికంగా చురుకుగా ఉంటే ఈ సంకేతాలను తేలికగా తీసుకోకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లైంగిక సంపర్కం తర్వాత కనిపించే 5 లక్షణాల గురించి తెలుసుకుందాం.
1. జననేంద్రియాల నుంచి అసాధారణ స్రావాలు:
* రతి తర్వాత అసాధారణ స్రావాలు జరిగితే అది STDకి సంకేతం కావచ్చు. ఇన్ఫెక్షన్ రకాన్ని బట్టి వాటి రంగు, వాసన ఉంటుంది.
* తెలుపు లేదా పసుపు రంగు స్రావాలు గోనేరియా లేదా క్లామిడియాకు సంకేతం.
* నురుగు, దుర్వాసనతో కూడిన స్రావాలు ట్రైకోమోనియాసిస్ ఇన్ఫెక్షన్ కు సంకేతం.
* ఆకుపచ్చ లేదా చీము లాంటి స్రావాలు తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు సంకేతం.
2. మూత్ర విసర్జన సమయంలో మంట లేదా నొప్పి:
సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా చీమలు కుట్టినట్లు లేదా నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. ఇది గోనేరియా, క్లామిడియా లేదా ట్రైకోమోనియాసిస్ వంటి ఇన్ఫెక్షన్ లక్షణం కావచ్చు. ఈ లక్షణాలు చాలాకాలం పాటు కొనసాగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
3. జననేంద్రియాల (నోరు లేదా మలద్వారం) చుట్టూ పుండ్లు, బొబ్బలు:
* హెర్పెస్ వైరస్ (HSV) సోకితే బొబ్బలు ఏర్పడి అవి పగిలిపోయి పుండ్లుగా మారుతాయి.
* సిఫిలిస్ సోకితే ప్రారంభ దశలో ఒక చిన్న నొప్పిలేని పుండు ఏర్పడుతుంది.
* HPV సోకితే జననేంద్రియాలపై లేదా మలద్వారం చుట్టూ చిన్న మొటిమల లాంటి కురుపులు ఏర్పడతాయి.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
4. జననేంద్రియాలలో దురద లేదా మంట:
శృంగారం తర్వాత జననేంద్రియ ప్రాంతంలో నిరంతరం దురద లేదా మంట ఉంటే అది STDకి సంకేతం కావచ్చు. ట్రైకోమోనియాసిస్, హెర్పెస్ అండ్ జఘన పేను వంటి ఇన్ఫెక్షన్లలో ఈ లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
5. రతి సమయంలో ప్రైవేట్ పార్ట్ లేదా పొత్తి కడుపులో నొప్పి:
లైంగిక ప్రక్రియ సమయంలో ప్రైవేట్ పార్ట్, లేదా పొత్తి కడుపులో నొప్పి ఉంటే అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి (PID) సంకేతం కావచ్చు. PID సాధారణంగా గోనేరియా, క్లామిడియా వల్ల వస్తుంది. ఇది వంధ్యత్వానికి కారణమవుతుంది.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..