Health Tips: నాలుకను శుభ్రం చేయడం లేదా? మీరు ప్రమాదంలో పడినట్లే

బద్దకం వల్ల కొందరు నాలుకను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోరు. దీనివల్ల దుర్వాసన, నోటిలో బ్యాక్టీరియా ఏర్పడటం, నోటిలో విష పదార్థాలు వంటివి ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరికి అలెర్జీ, చర్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Tongue

Tongue Photograph: (Tongue )

తినే ఆహారం రుచిగా ఉందా లేదా అనేది నాలుక చెబుతుంది. జ్వరం వచ్చినందని డాక్టర్ దగ్గరకు వెళ్తే.. తప్పకుండా నాలుక చూస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూ్ల్ వల్ల చాలా మంది నోటిని అసలు శుభ్రం చేరుకోరు. దీనివల్ల నోటిలో బ్యా్క్టీరియా ఉండిపోతుంది. చాలా మంది బద్దకం వల్ల కొన్నిసార్లు బ్రష్ కూడా చేయరు. అసలు నాలుకను శభ్రం చేసుకోకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు (Health Problems) వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

నోటిపూత చిగుళ్ల వ్యాధి..

నోరు ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. నాలుక (Toungue) ను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే దంతక్షయం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే చిగుళ్ల వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కొన్నిసార్లు దీనివల్ల నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఎందుకంటే నాలుకను శుభ్రం చేయకపోతే విషపదార్ధాలు పేరుకుపోతాయి. దీంంతో దుర్వాసన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

వైద్యులు నాలుకను బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తారు. నాలుకను శుభ్రం చేసుకోకపోతే కొన్ని సార్లు కడుపు నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరి నాలుకపై తెల్లటి బొబ్బలు వస్తాయి. అలాగే రక్తహీనత, విటమిన్ల లోపం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి నాలుకను డైలీ తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోండి. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fenugreek Water: ఉదయాన్నే ఈ నీళ్లు తాగితే డయాబెటిస్ రాదు

ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, ఒత్తిడి వల్ల డయాబెటిస్ వ్యాధి ప్రతి ఒకరిని ప్రభావితం చేస్తోంది. మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే అనేక ప్రయోజనాలున్నాయి. ఇది టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update

Fenugreek Water: ఇప్పటి కాలంలో మధుమేహం సమస్య వేగంగా పెరుగుతోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, ఒత్తిడి కారణంగా ఈ వ్యాధి ప్రతి ఇంటిలో ఒకరిని ప్రభావితం చేస్తోంది. డయాబెటిస్ పూర్తిగా నయం కాదన్న భావన ఉన్నా కొన్ని సహజమైన మార్గాలతో దీన్ని నియంత్రించవచ్చు. అటువంటి సహజ చికిత్సలలో మెంతులు ఎంతో ముఖ్యమైనవి. ఇవి మన ఇంట్లోనే సులభంగా దొరికే సాధారణ గింజలే అయినా శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. మెంతుల రుచి కొంచెం చేదుగా అనిపించినా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే తప్పనిసరిగా మన జీవనశైలిలో చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు.

మధుమేహం ఉపశమనం:

ముఖ్యంగా మెంతులను రాత్రికి రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మెంతులలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, బి1, బి2, బి3, బి6, ఫోలేట్ వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మెంతుల నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో మెంతి నీరు సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: గర్భిణులు మొదటి మూడు నెలల్లో ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి

ఇది కాలేయ ఆరోగ్యానికి, గుండెకు మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా మధుమేహ ప్రభావాన్ని తగ్గించగలదు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం లేవగానే వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. మీరు మెంతి గింజలను తినాలనుకుంటే కూడా తినొచ్చు. ఇది శరీరానికి ఫైబర్ అందిస్తూ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ విధంగా రోజూ పాటిస్తే మధుమేహ నియంత్రణలో ఉండటం కాకుండా శరీరానికి శక్తిని ఇస్తుంది. సహజంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గంలో ఇది ఒక చక్కటి పరిష్కారం అని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టమోటాలు ఇలా వాడారంటే జుట్టు వద్దన్నా పెరుగుతుంది


( fenugreek-water | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు