/rtv/media/media_files/2025/03/31/kcU6tWFAta0dy4imuits.jpg)
salad
వేసవి వచ్చిదంటే చాలు ఎండలకు హడలిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. కొద్దిసేపు ఎండకు తిరిగితే చాలు శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి దాహం, నీరసం, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచే, హైడ్రేటెడ్‌గా నిలిపే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. దోసకాయ సలాడ్ ఎండ కాలంలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పుకోవచ్చు.
Also Read: Myanmar: మూడు రోజుల తరువాత భూకంప శిథిలాల కింద నుంచి సజీవంగా..!
ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎండా కాలంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది:
వేసవిలో అధిక చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని వల్ల నిర్జలీకరణ, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. దోసకాయలో 95 శాతం నీరు ఉండటం వల్ల.. ఇది శరీరాన్ని తక్కువ సమయంలోనే హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. రోజూ దోసకాయ తినడం వల్ల శరీరానికి తాజాదనం పెరుగుతుంది, అలసట తగ్గుతుంది.
Also Read: నా కొడుకును బలిపశువు చేస్తున్నారు! మోహన్ లాల్ కి అంతా తెలుసు: పృథ్వీరాజ్ తల్లి
చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది:
మెరిసే చర్మాన్ని కోరుకునే వారికి దోసకాయ అద్భుతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. మొటిమలు, మచ్చలు తగ్గి, చర్మం సహజంగా మెరుస్తుంది. వేసవిలో ఎక్కువగా ఉండే తాప ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.దాం..
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
బరువు తగ్గాలనుకునే వారికి దోసకాయ సలాడ్ ఉత్తమమైన ఎంపిక. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది, కానీ ఫైబర్ అధికంగా లభిస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. భోజనానంతరం కడుపుని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. వెల్లుల్లి, నిమ్మకాయ, పెరుగు వంటి పదార్థాలతో కలిసి తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. .
దోసకాయను ఎలా తినాలి..?
దోసకాయను వివిధ రకాల్లో తినవచ్చు. అయితే, పచ్చిగా తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
రైతా – తురిమిన దోసకాయను పెరుగులో కలిపి తినడం ఉత్తమం.
డీటాక్స్ వాటర్ – దోసకాయ ముక్కలను నీటిలో వేసి, ఆ నీటిని త్రాగితే శరీరాన్ని డీటాక్స్ గా ఉంచుతుంది.
శాండ్‌విచ్‌లు, రోల్స్ – ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపయోగించవచ్చు.
Also Read: BIG BREAKING: ఏపీలో రేపు సెలవు
Also Read: America-Iran: అటు ట్రంప్ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్...!
health | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | latest-telugu-news | latest telugu news updates