Devara Movie: 'దేవర'లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్.. క్రూరమైన లుక్ లో ఎన్టీఆర్!!

New Update
Devara Movie: 'దేవర'లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్.. క్రూరమైన లుక్ లో ఎన్టీఆర్!!

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. డైరెక్టర్ కొరటాల ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్.. ఈ మూవీపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ లుక్ లో ఎన్టీఆర్ మాస్ గా కనిపించాడు.

ఈ చిత్రాన్ని కొరటాల కొన్ని యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దళితులపై అగ్రవర్ణాల వారు చేసిన మారణకాండను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తుండటంతో పాటు అన్ని ఇండస్ట్రీలోని నటీనటులను ఎంపిక చేయడంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయని సమాచారం. ఈ ఫ్లాష్ బ్యాక్ ను విజువల్ యాక్షన్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు కొరటాల. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ క్రూరమైన లుక్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు