author image

E. Chinni

By E. Chinni

గత కొద్ది రోజుల క్రితం టమాటా అనగానే ఆమడ దూరం పారిపోయేవారు. అంతలా ఆకాన్నంటాయి టమాటా ధరలు. ఒక్కసారిగా కిలో రూ.200 వరకూ వెళ్లాయి. దీంతో రైతులకు కాసుల పంట కురిశాయి. కానీ వినియోగదారుడు మాత్రం చితికిపోయాడు. టమాటాలు అమ్మి ఒక్కో ప్రాంతాల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు రైతులు. ఇప్పుడు ఇదే టమాటా ధరలు రైతును కంట తడి పెట్టిస్తున్నాయి. మొన్నటి వరకూ కిలో రూ.200కి పైగా లభించే టమాటాలు ఇప్పుడు కిలో రూ.9 నుంచి రూ.30 పలుకుతున్నాయి. దీంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

By E. Chinni

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం సభలో సీఎం జగన్ ని, ఇతర వైసీపీ నేతలను పరుష పదజాలంతో దూషించారనే ఆరోపణలతో ఆయన్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తున్నారు.

By E. Chinni

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో స్పీడ్ పెంచింది. కీలక ప్రయోగాలతో ఇస్రో దూసుకెళ్తుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత..’ఆదిత్య హృదయాన్ని’ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. సూర్యగోళం రహస్యాలను ఛేదించడానికి.. శ్రీహరి కోట వేదికగా రంగం సిద్ధమైంది. Aditya L1 Solar Mission 2023

By E. Chinni

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్‌ కుమారుడిపై తిరగబడ్డారు అమలాపురం కేసుల్లో ఉన్న స్థానికులు. మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై దాడికి యత్నించారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి? అని స్థానికులు విశ్వరూప్ పై విరుచుకు పడ్డారు.

By E. Chinni

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జీ పల్లోంజి (ఎస్పీసీఎల్), ఎల్ అండ్ టీ సమస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను.. ఐటీ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. IT Notices to Chandrababu Naidu

By E. Chinni

భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సీఎం విదేశీ పర్యటనలో ఉండనున్నారు. మొత్తం 10 రోజుల పాటు కుటుంబంతో కలిసి యూకేలో ఉన్న తమ కూతుళ్లను చూసేందుకు సీఎం జగన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.

By E. Chinni

. గురువారం నారా లోకేష్ కొయ్యలగూడెం మండలం బయ్యన గూడెం వద్ద పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామస్తులు లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని లోకేష్ కు వివరించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు.

By E. Chinni

చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి మదపుటేనుగు దాడిలో మరో మహిళ మృతి చెందింది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు బోడి నత్తం గ్రామానికి చెందిన మహిళ వసంత(57) అనే మహిళ ఏనుగు దాడిలో మృతి చెందింది. గురువారం తెల్లవారు జామున వసంత అనే మహిళపై దాడి చేసి చంపేసింది. శ్రీరంగం పల్లి చెరువు నుంచి కుంకి ఏనుగుల ద్వారా అటవీ ప్రాంతంలోకి అధికారులు మళ్లీస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏనుగు వరుసగా దాడి చేస్తూండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ కు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్ష సూచన జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. వానలు పడాల్సింది పోయి.. ఎండలు మండిపోతున్నాయి. నిజానికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్, జులై, ఆగష్టు నెలలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే నెల సెప్టెంబర్ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు