author image

E. Chinni

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ లోని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రైతులకు రైతు భారోసాను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సహాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.7,500 జమ కానున్నాయి.

By E. Chinni

వైజాగ్ కు చేరుకున్న బెంగాల్ పోలీసులు.. హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై విచారణ మొదలు పెట్టారు. అనంతరం ఓ క్లారిటీకి వచ్చాక గురువారం రితు సాహు మృతిపై సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది.

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్సేత్రం అయిన శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో అర్థరాత్రి సమయంలో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు.

By E. Chinni

ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. సాయంత్రం, రాత్రివేళల్లోనే కాదు.. రోజంతా బార్ షాపుల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. యువత కూడా మద్యానికి బాగా అలవాటుపడిపోయింది. వారికి తగ్గట్టే మార్కెట్లో రకరకాల మద్యం బ్రాండ్స్ వస్తున్నాయి. బ్యాచిలర్ పార్టీ, హౌస్ పార్టీ, బార్, పబ్, హోటల్ లో ఆల్కహాల్ తో పాటు.. ఆహారపదార్థాలు కూడా వడ్డిస్తారు. మద్యంతో పాటు కొన్నిరకాల ఆహారాలను ఆర్డర్ చేస్తారు. ఆల్కహాల్‌తో పాటు లేదా మద్యం

By E. Chinni

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామిని పోలీసులు హౌస్ అరెస్ట్ అడ్డుకున్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇసుక సత్యాగ్రహం మూడవ రోజు బుధవారం విజయవాడలో మైనింగ్ కమిషనర్ కార్యాలయంల దగ్గర ధర్నాలో పాల్గొంటారన్న సమాచారంలో.. ముందస్తుగా పోలీసులు ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చీటికి మాటికీ మా ఇంటికి వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న మమ్మల్ని ఇలా అడ్డుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు.

By E. Chinni

తెలుగు దేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాశక్తి - రక్షా బంధన్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు పీతల సుజాత, వంగలపూడి అనిత, తెలుగు మహిళలు, బ్రహ్మ కుమారీలు రాఖీలు కట్టారు. అనంతరం మహిళలకు టీడీపీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల గురించి చంద్రబాబు వివరించారు.

By E. Chinni

ఇసుక పాలసీ, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు బుధవారం ఆందోళనలు నిర్వహిస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడికి టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీసులు గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ ఇసుక, అక్రమ మైనింగ్‌పై తెలుగు దేశం పార్టీ పోరాటం చేస్తోంది

By E. Chinni

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం రోజు రోజుకూ ఎక్కువవుతుంది. ఏనుగుల గుంపు తరచూ పంటలపై దాడి చేస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడి పల్లె జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. తాజాగా గుడిపాల మండలంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో భార్యభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

By E. Chinni

అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే పిటిషన్ పై బుధవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వి చారణ జరిగింది. టీటీడీ మాజీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరుమల కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారనే అంశంపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

By E. Chinni

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి రజిని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినప్పటినుంచి మంత్రి రజినితో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు సఖ్యత లేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను‌మొదటినుంచి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇదే మంత్రి రజిని ఎంపీ మధ్య విభేదాల కారణమైంది. తర్వాత ఎంపీ, మంత్రి వర్గాల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం నియోజకవర్గంలో రొటీన్ గా మారాయి. ఎంపీ కనీస సమాచారం లేకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారంటూ మంత్రి రజిని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలోనే నాలుగైదు సార్లు ఎంపీ, మంత్రి వర్గాలు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయు.

Advertisment
తాజా కథనాలు