author image

E. Chinni

By E. Chinni

సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చెక్ పెట్టడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద స్కెచ్ వేసిందా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? నందమూరి బాలకృష్ణను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ, గతంలో వైసిపి వర్గ విభేదాల వల్లనే వైసిపి ఓటమి పాలు అవుతూ వస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ పెద్దలు. 1983 టిడిపి ఆవిర్భావం నుంచి హిందూపురం టిడిపికి కంచుకోటుగా ఉంది. నందమూరి తారక రామారావు రెండుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా నందమూరి హరికృష్ణ సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

By E. Chinni

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని అక్క, చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. బుధవారం ట్వీట్వర్ వేదికగా జగన్ శుభాకాంక్షలు చెప్పారు. 'ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడిని. మీ సంక్షేమమే లక్ష్యంగా.. మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తూ మీకు ఒక అన్నగా, తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉండానని మాట ఇస్తున్నా' అని పేర్కొన్నారు సీఎం జగన్.

By E. Chinni

మనం నిత్యం ఉపయోగించుకునే వాటిల్లో వెల్లుల్లి ఒకటి. మనం వండే వంటకాల్లో వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తూంటాం. వెల్లుల్లితో ఎన్నో అనారోగ్య సమస్యలు, వ్యాధులకు, రోగాలకు చెక్ పెట్టవచ్చు. అంత శక్తి వెల్లుల్లికి ఉంది. వెల్లుల్లిని ఏ రూపంలో మనం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

By E. Chinni

వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అంటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మనపై ఎఫెక్ట్ చూపకుండానే ఇమ్యునిటీని పెంచుకోవాలి. చిన్నారుల్లోనూ, పెద్ద వారిలోనూ ఫ్లూ, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

By E. Chinni

శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఏ భాగంలో సమస్య వచ్చినా.. అది మొత్తం శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అందులోనూ శరీరంలో ముఖ్యంగా పని చేసేవి కిడ్నీలు. మరి ఈ కిడ్నీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు పాడైతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు.

By E. Chinni

కర్నూలు జిల్లాకు చెందిన మోదీన్ బీ (32)కి అనంతపురంలోని పీసీ ప్యాపిలికి చెందిన కానిస్టేబుల్ వన్నూరు స్వామితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంతవరకూ వారికి పిల్లలు కలగ లేదు. దీంతో పిల్లల కోసం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలోని గైనకాలజిస్టును సంప్రదించారు. ఆమె ఐవీఎఫ్‌ ద్వారా సంతానం కలిగేలా చికిత్స చేస్తానని నమ్మ బలకడంతో, కుటుంబ సభ్యులు ఆమె మాటలు నమ్మారు.

By E. Chinni

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీకి చిక్కులు ఎదురువుతున్నాయి. 175కి 175 సీట్లు సాధిస్తామంటోన్న నేతలకు అసమ్మతి ఎదురవుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి పోరును ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీ అధిష్టానానం తలలు పట్టుకుంటోంది. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంతి. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొఠారు అబ్బయ్య చౌదరికి టికెట్ ఇస్తే వైసీపీ ఓటమి పాలవ్వడం ఖాయమని అంటున్నారు.

By E. Chinni

విశాఖ పట్నం నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహా అనుమానస్పద స్థితిలో మృతి చెంది. అయితే అది ఆత్మహత్య కాదు.. హత్య అని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రితీ సాహా పేరెంట్స్ ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ సీఎం.. విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియాను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

By E. Chinni

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్ (Yarlagadda Venkatrao) నియమితులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఆదేశాల ప్రకారం యార్లగడ్డను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

Advertisment
తాజా కథనాలు