TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల!

తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వెలువడనుంది. మరికొన్ని రోజుల్లో గ్రూప్-1, 2, 3లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మార్చి 10 లోపే తుది ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. 

New Update
TGPSC

Telangana Groups Results released in March first week

TGPSC Update: తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు త్వరలోనే గుడ్ న్యూస్ వెలువడనుంది. మరికొన్ని రోజుల్లో గ్రూప్-1, 2, 3లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. మార్చి 10 లోపే తుది ఫలితాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: City Killer Asteroid:దూసుకొస్తున్న "సిటీ కిల్లర్".. దేశంలో ఆ రెండు నగరాలు ఇక కనిపించే అవకాశం లేదా!

మార్చి ఫస్ట్ వీక్ లో గ్రూప్-1..

ఈ మేరకు మార్చి ఫస్ట్ వీక్ లో గ్రూప్‌-1 మెయిన్స్‌ జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ఆ తర్వాత గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఫలితాలను వరుస తేదీల్లో ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఒకే అభ్యర్థి 2 లేదా 3 పోస్టులకు ఎంపికైతే ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఒకదాని తర్వాత మరో పరీక్ష ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఈ మూడు పరీక్షలకు సంబంధించి 2,734 పోస్టులున్నాయి. ఇందు కోసం 5,51,247 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

గ్రూప్ 1:
ఇప్పటికే గ్రూప్ 1 ఫలితాల్లో అవతవకలు జరగగా ఈసారి చాలా పకడ్బందీగా రిజల్ట్స్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. 2024 ఫిబ్రవరిలో 63 పోస్టులను కలిపి మొత్తం 563 ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూన్‌ 9న 897 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. 3.02 లక్షల మంది పరీక్షలు రాశారు. మెయిన్స్‌కు 31,382 మంది అర్హత సాధించారు. అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. 21,093 మంది మాత్రమే అన్ని పరీక్షలకు హాజరయ్యారు. దీంతో పోటీ 1:50 నుంచి 1:37కు తగ్గింది. మెయిన్స్‌ జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా మార్చి మొదటి వారంలో విడుదల చేసి 1:2 ప్రాతిపదికన అభ్యర్థులను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలవనున్నారు. 

Also Read: Uttarpradesh: యోగి ప్రభుత్వం న్యూ స్కీమ్.. ఉచితంగా విద్యార్థినులకు స్కూటీలు

గ్రూప్‌-2 :
2024 డిసెంబరు 15, 16 తేదీల్లో 1,358 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 5,51,855 మందికి గాను 2,57,981(46శాతం) మంది మాత్రమే హాజరయ్యారు. గ్రూప్‌-2లో 783 పోస్టులుండగా 1పోస్టుకు 329 మంది పోటీ పడుతున్నారు. 

గ్రూప్ 3:
2024 నవంబరులో ఈ పరీక్షలు జరిగాయి. 6,15,503 మంది అభ్యర్థులకు గాను 2,72,173 మంది పరీక్షలకు హాజరయ్యారు. 1,388 పోస్టుల్లో 1 పోస్టుకు 196 మంది పోటీపడుతున్నారు. ఇక ఖాళీల సమస్య ఉండకుండా మొదట గ్రూప్‌-1 ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత గ్రూప్‌-2, 3 రిజల్ట్స్ ప్రకటించాలని చూస్తోంది. 

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!


Advertisment
Advertisment
Advertisment