TGPSC Results: మరో నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే!

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను టీజీపీఎస్‌సీ రిలీజ్ చేసింది. 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 574 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/.

New Update
tgpsc

TG Hostel Welfare Officers Results Released

TG Hostel Welfare Officers: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను టీజీపీఎస్‌సీ రిలీజ్ చేసింది. 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 574 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌(https://www.tspsc.gov.in/)ను సంప్రదించాలని సూచించింది. 

581 పోస్టులకు 574 మంది..

2022 డిసెంబర్‌‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562, శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024 జూన్‌ 24 నుంచి 29 వరకు కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 82,873 మంది హాజరవగా ఇటీవలే కమిషన్‌ ఫలితాలను వెల్లడించింది. అయితే తాజాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి తుది ఫలితాలను విడుదల చేసింది. 

Also Read :   Betting Apps: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కాజల్.. రంగంలోకి సజ్జనార్?

ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్‌-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 87 ఉద్యోగాలున్నాయి. పోస్టుమెట్రిక్‌ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్‌ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఈ నోటిఫికేషన్ తో భర్తీ కానున్నాయి. 

Also Read :  USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

INTER ACADEMIC CALENDAR 2025-26: విద్యార్థులకు గుడ్ న్యూస్​.. నెల రోజులు సమ్మర్​ హాలిడేస్

తెలంగాణ ఇంటర్‌బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాలండర్​ విడుదల చేసింది. సెప్టెంబర్ 28-అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు, జనవరి 11-18 వరకు సంక్రాంతి సెలవులు, ఏప్రిల్ 1-మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించింది. జూన్ 1 నుంచి కాలేజీలు ప్రారంభం.

New Update
TSBIE Telangana Board Academic Calendar 2025-26 OUT: Check Full Schedule

TSBIE Telangana Board Academic Calendar 2025-26 OUT

తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) తాజాగా రాష్ట్రంలో జూనియర్ కాలేజీల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ బోర్డు క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. అందులో కాలేజీ పనిదినాలు, తరగతులు, సెలవులు(Inter Holidays), ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను వెల్లడించింది. ఇందులో భాగంగానే గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కొత్త అకడ‌మిక్ క్యాలెండ‌ర్‌‌ను (New academic calendar) రిలీజ్ చేశారు. 

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

ఈ ఏడాది జూన్ 2 నుంచి ఇంటర్ కళాశాళలు మొదలు అవుతాయని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు సమ్మర్ హాలిడేస్ అని తెలిపారు. అందువల్ల ఏవైనా కాలేజీలు ఈ వేసవి సెలవుల్లో క్లాస్‌లు నిర్వహింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయని తెలిపారు. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఇందులో భాగంగానే ఈ సారి ఇంటర్ తరగతులు మొత్తం 226 రోజుల పాటు ఉండనున్నాయి. అంతేకాకుండా జూనియర్ కళాశాళలకు 77 రోజులు  సెలవులు రానున్నాయి. 2026 ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మార్చి నెలలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం..

దసరా సెలవులు: 2025 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు సెలవులు.

ఆఫ్ ఇయర్ ఎగ్జామ్స్ : 2025 నవంబర్ 10 నుంచి 15 వరకు ఇంటర్ ఆఫ్ ఇయర్ పరీక్షలు

సంక్రాంతి సెలవులు: 2026 జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.

ప్రాక్టికల్స్: 2026 ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి.

ఫైనల్ పరీక్షలు: 2026 మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

వేసవి సెలవులు: 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి.

తరగతులు ప్రారంభం: 2026 జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం తరగతులు మళ్లీ పున:ప్రారంభం అవుతాయి.

(telangana-inter-board latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment