Teachers: టీచర్స్ బదిలీ చట్టంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఏపీ పాఠశాల విద్యలో జీవో 117 ఉపసంహరణపై ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యార్థి డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు.

New Update
lokesh

AP Minister Lokesh key decision on withdrawal of GO 117

AP News: పాఠశాల విద్యలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 ఉపసంహరణపై అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉపాధ్యాయ బదిలీ చట్టంలో మార్పులు..

ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో జీవో 117 ఉపసంహరణపై వచ్చిన అభిప్రాయాలను, సూచనలను మంత్రికి వివరించారు. దీంతో ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలని లోకేష్ చెప్పారు. అతి త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో లోకేష్ చర్చించారు. ఈ చట్టంపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని తెలిపారు. 

ఇది కూడా చదవండి: U19 Women World Cup: టీ20ల్లో తొలి సెంచరీ నమోదు.. అదరగొట్టిన తెలంగాణ బిడ్డ!

ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్‌ల స్థానంలో ఒకటే యాప్ రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను నిర్థారించేందుకు అపార్ ఐడీని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నారు. ప్రజాభిప్రాయసేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయాలని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు హాజరయ్యారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. బదిలీల షెడ్యూల్ ఖరారు!

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురాగా మే 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను భర్తీ చేయనుంది. 

New Update
DSC Posts

AP government key decision on government teachers transfers

Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మే 30 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.  ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను  భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 

GO-117 రద్దు..

ఈ మేరకు ఈ చట్టం ప్రకారం మొదటిసారి బదిలీలు చేయనుండగా GO-117ను రద్దు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి తీసుకురాబోతున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానంలో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయనున్నారు. 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉండగా.. 1-5 తరగతులకు 5గురు టీచర్లను  కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95% పూర్తి చేయగా.. 430 బడులకు సంబంధించి ఫనల్ చేయాల్సివుంది.  వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసి మే 30 వరకు బదిలీల అంశాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. అలాగే సీనియారిటీ టీచర్ల జాబితాను ఏప్రిల్ 20వరకు సే పూర్తి చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇక బదీలల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఖాళీల ఆధారంగా ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక టీచర్‌ ఎన్ని ఆప్షన్స్ అయినా ఎంచుకోవచ్చు.  సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులు కేటాయించనున్నారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలలో మళ్లీ పనిచేసే అవకాశం ఉండదు. 2 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకున్నవారు నచ్చిన పాఠశాలను ఎంచుకోవచ్చు. మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులుంటాయి. స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించనున్నారు. చివరిగా SGTలకు బదిలీలు నిర్వహిస్తారు.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 transfer | cm-chandrababu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment