/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/usa-1-1-jpg.webp)
America
అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ అధికాకాలు చెప్పటినప్పటి నుంచి కూడా వలసలవిషయంలో అమెరికా సర్కారు దూకుడు నిర్ణాయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అక్రమ వలసదారుల పై ఉక్కుపాదం మోపి వారిని దేశం నుంచి పంపిస్తున్న సంగతి తెలిసిందే.ఇక తాత్కాలిక వలసదారులుగా వచ్చిన వారి పైనా కన్నెర్ర చేస్తోంది.
Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!
ఇలాంటి పరిణామాల వేళ అగ్రరాజ్యంలోని ఉక్రెయిన్ పౌరులకు వచ్చిన ఓ సందేశం వారిని హడలెత్తించింది. వారం రోజుల్లోగా దేశాన్ని వీడాలని మెయిల్ వచ్చింది. అయితే అది పొరపాటు అని చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Ap Weather Report: ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..
2022 లో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన తరువాత ఆ దేశానికి చెందిన పౌరులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది.మానవతా పెరోల్ ప్రోగ్రామ్ కింద వారికి అగ్రరాజ్యంలో తాత్కాలిక నివాసం కల్పించారు.అయితే ఇటీవల వీరందరికీ ఓ సందేశం వచ్చింది.
మీ పెరోల్‌ను రద్దు చేస్తున్నాం.ఇంకా అమెరికాలోనే ఉండాలని ప్రయత్నించొద్దు. ఏడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలి. లేదంటే ఫెడరల్ ప్రభుత్వమే వెతికి పట్టుకుంటుంది. ఆ తరవాత చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూఎస్ నుంచి మిమ్మల్ని వెళ్లగొడతాం అని ఆ మెయిల్ లో ఉంది.
దీంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈక్రమంలోనే తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి స్పందించారు. అది పొరపాటుగా వెళ్లిన మెయిల్ అని తెలిపారు.ఉక్రెయిన్ పౌరులకు కల్పించిన మానవతా పెరోల్ ను రద్దు చేయలేదని వివరించారు. ఎర్రర్ మెసేజ్ లు వచ్చిన వారందరికీ మళ్లీ మెయిల్స్ పంపించినట్లు తెలిపారు.
వారి తాత్కాలిక నివాస హోదాలో ఎలాంటి మార్పు లేదన్నారు.క్యూబా, హైతీ,నికరాగ్వా, వెనెజువెలా దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులకుచట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్లు ఇటీవల హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. 2022 అక్టోబర్ తరువాత ఆ నాలుగు దేశాల నుంచి అమెరికికాఉ వలస వచ్చిన దాదాపు 5,32,000 మందికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
ఇదే సమయంలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన 2.40 లక్షల మంది తాత్కాలిక చట్ట హోదాను కూడా రద్దు చేయాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళిక చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కథనాల వేళ తాజాగా ఎర్రర్ మెయిల్ రావడం తమకు గుబులు పుట్టించిందని ఉక్రెయిన్ పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...వారంలో మెగా డీఎస్సీ!
Also Read:Hyderabad: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం!
ukrain | russia | attacks | blackmail | email | e-mail | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates