America: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

వీసా గడువు ముగిసినా.. అక్రమంగా అమెరికాలోనే ఉంటున్నవారిపై చర్యలు తీసుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలకు రెడీ అయింది. వీసాలు, హెచ్-1బీ వీసాల గడువు పూర్తి అయినా.. చాలా మంది ఆ దేశంలోనే ఉండడంతో నిబంధనలను కఠినతరం చేయాలనుకుంటున్నారు.

New Update
Visa

Visa Photograph: (Visa)

అమెరికాలో అక్రమంగా ఉండేవారి పట్ల నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పకడ్బందీగా చేసి.. అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు.. హెచ్‌-1బీ వీసాల రూల్స్‌ను, ఇమ్మిగ్రేషన్ పాలసీలను మరింత కఠినతరం చేయాలని హౌస్‌ కమిటీకి తాజాగా నిపుణులు చెప్పారు. 

Also Read:Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!

అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్‌ కమిటీ విచారణ చేపట్టగా.. చట్టసభ సభ్యులు పలు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఒక్క 2023లోనే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 7 వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోనే ఉన్నారని సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ స్టడీస్‌కు చెందిన జెస్సీకా ఎం.వాఘన్‌.. హౌస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 

Also Read:USA: విమానాన్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు..అధ్యక్షుడు ట్రంప్ అనుమానం

32 దేశాలకు చెందిన స్టూడెంట్లు, స్టూడెంట్‌ ఎక్స్ఛేంజ్ విజిటర్లలో 20 శాతానికి పైగా మంది.. వీసా గడువు దాటినా అమెరికాలోనే ఉంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఎఫ్‌, ఎం కేటగిరీల్లో వీసాలు తీసుకున్నవారే అధికంగా ఇలా వీసీ గడువు ముగిసిన తర్వాత అక్రమంగా ఉంటున్నారని తెలిపారు.అమెరికాలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఎఫ్‌-1 వీసాలు జారీ చేస్తారు. ఇక ఎమ్-1 వీసాలను వృత్తివిద్యా కోర్సులు, నాన్‌ అకడమిక్‌ అవసరాలకు, లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌లకు జారీ చేస్తుంటారు. ఇక బ్రెజిల్‌, చైనా, కొలంబియా, భారత్‌కు చెందిన 2వేల మందికి పైగా విద్యార్థులు వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలోనే ఉన్నారని తెలిపారు. 

వీరిలో అత్యధికంగా భారతీయులే ఉన్నట్లు తెలుస్తుంది. అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వారిని స్వదేశాలకు పంపించేలా ఇంటీరియర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఇందుకోసం చట్టంలో కాంగ్రెస్‌ కొన్ని సవరణలు చేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువు పూర్తి అయిన తర్వాత వారి దేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని జెస్సీకా ఎం.వాఘన్‌ తెలిపారు.

రెండేళ్ల గడువు మాత్రమే...

ఇక హెచ్‌-1బీ వీసాలకు రెండేళ్ల గడువు మాత్రమే ఉండాలని జెస్సీకా వెల్లడించారు. అవసరమైతే 4 ఏళ్లకు పొడిగించేలా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్‌లిమిటెడ్‌గా ఉన్న రీసెర్చ్, నాన్‌ ప్రాఫిట్‌ సహ వీసాల సంఖ్య 75 వేలలోపే ఉండాలని చెప్పారు. ఒకవేళ వీసా సబ్‌స్క్రిప్షన్లు ఎక్కువగా ఉంటే.. అధిక జీతాలు ఇచ్చే సంస్థకు కేటాయించారని.. ఇలా చేయడం వల్ల స్కిల్స్ ఉన్నవారికి అవకాశం లభిస్తుందని తెలిపారు. 

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వీసాలు కేటాయించాలని జెస్సీకా సూచించారు. అమెరికాలో ఉద్యోగులకు కొరత లేదని పేర్కొన్న జెస్సీకా.. ఒక్క సేమ్‌ డిగ్రీలు పూర్తి చేసి.. వివిధ రంగల్లో పనిచేయకుండా ఉన్నవారి సంఖ్య 20 లక్షలు ఉందని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Also Read: Washington DC plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఒక్కరు కూడా మిగల్లేదు: 67 మంది మృతి..!

Also Read: BIG BREAKING: తెలంగాణలో షాకింగ్ కొత్త వైరస్.. సిద్దిపేటలో తొలి కేసు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు