/rtv/media/media_files/2026/04/17/khasrak-air-base-in-syria-2026-04-17-12-43-45.jpg)
మధ్యప్రాచ్య రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధ(iran america war) చేస్తుండగా.. మరో వైపు కీలక మార్పులు చేపట్టింది ట్రంప్ సర్కార్. అమెరికా తన సైన్యాన్ని సిరియా నుండి ఉపసంహరించుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం సిరియాలోని హసకా ప్రావిన్స్‌లో ఉన్న కీలకమైన ఖస్రాక్ వైమానిక స్థావరాన్ని(Khasrak air base in Syria) అమెరికా దళాలు పూర్తిగా ఖాళీ చేశాయి. భారీ సైనిక సామగ్రితో కూడిన చివరి కాన్వాయ్ ఈ స్థావరాన్ని వీడింది. దీంతో సిరియాలో అమెరికా తన ప్రధాన సైనిక ఉనికిని దాదాపుగా ముగించినట్లయింది. - us air force security forces
🚨 THE END OF ERA. The United States has fully withdrawn its troops from Syria
— NEXTA (@nexta_tv) April 16, 2026
The last convoy has just left the Qasrak base in the northeast of the country.
13 years of American military presence — over.That moment many have been waiting for, and few still believed would… pic.twitter.com/qDFqnbbbdp
Also Read : అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చుక్కలు చూపిస్తున్న చైనా.. ఇరాన్ చేతిలో మ్యాన్‌ప్యాడ్స్?
సెంట్ కామ్ వివరణ
అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఈ పరిణామాన్ని ధృవీకరించారు. ఇది ఆకస్మిక నిర్ణయం కాదని, ఒక వ్యవస్థీకృత ప్రణాళికాబద్ధమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉగ్రవాద నిర్మూలనలో తమ మిత్రదేశాలకు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా సైన్యం నిష్క్రమణను సిరియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించింది. తమ దేశ భూభాగంపై తిరిగి నియంత్రణ సాధించడాన్ని "సార్వభౌమాధికార పునరుద్ధరణ"గా సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిరియా ప్రభుత్వం, కుర్దిష్ యోధుల (SDF) మధ్య కుదిరిన కీలక ఒప్పందమే ఈ మార్పుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐసిస్ ఉగ్రవాదులపై విజయం సాధించిన అనంతరం, సుమారు 5,700 మంది ఉగ్రవాదులను ఇరాక్ జైళ్లకు తరలించి విచారణ చేపట్టారు.
Also Read : బంగారం ప్రియులకు బంపరాఫర్.. ఆ నదిలో కొట్టుకొస్తున్న బంగారం.. ఎలా ఎగబడుతున్నారో చూడండి!
ట్రంప్ వ్యూహం - ఇరాన్ విమర్శలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి తీసుకువచ్చే ప్లాన్ అమలు చేస్తున్నారు. యురేనియం సరఫరాకు సంబంధించి ఇరాన్ ఒప్పందానికి అంగీకరించిందని ట్రంప్ ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే, ఇరాన్ మాత్రం అవన్నీ "అబద్ధాలు" అని కొట్టిపారేస్తోంది. ఈ సమయం చాలా కీలకమైనది. అమెరికా తన ప్రత్యక్ష సైనిక పోరాటాల కంటే, దౌత్యపరమైన ఒత్తిడితో ఇరాన్‌ను కట్టడి చేసేందుకే మొగ్గు చూపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అల్-తాన్ఫ్ వంటి కీలక స్థావరాలను ఖాళీ చేయడం ద్వారా, మధ్యప్రాచ్యంలో అమెరికా తన ప్రాధాన్యతలను మార్చుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమం ఇరాన్-అమెరికా సంబంధాలను మరింత సందిగ్ధంలోకి నెట్టివేసే అవకాశం ఉంది.
Follow Us