/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/zelensky-jpg.webp)
Ukraine
రష్యా,ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది.ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు,అధికారుల బృందం,ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి.
దీంతో అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
దీంతో ఉక్రెయిన్ లో ఖనిజాల తవ్వకం పై ఒప్పందం ఎటూ తేలకుండా ముగిసింది.అంతేకాకుండా ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం సైనిక సాయం నిలిపివేసింది.తాజాగా రష్యాతో శాంతి ఒప్పందానికి సంబంధించి ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఇరు పక్షాలు చర్చలు జరిపాయి. దీంతో 30 రోజుల సాధారన కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.
ఈ నేపథ్యంలో సైనిక సాయం,నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్ పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది.ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.
యూఎస్ తరుఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ,జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల పై రూబియో మాట్లాడుతూ..ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు తెలుపుతామన్నారు.ఇప్పుడు బంతి మాస్కో చేతిలో ఉందన్నారు.జెలెన్ స్కీ సౌదీకి వెళ్లినప్పటికీ ఈ చర్చల్లో పాల్గొనలేదు.
Also Read: KCR: ఆ అంశాలపై పోరాడుదాం.. ప్రభుత్వం మెడలు వంచుదాం.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ కీలక సూచనలు!