/rtv/media/media_files/2025/02/17/t92iN9lGsGQb7slZoPAB.jpg)
keir
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్,ఐరోపా భద్రత దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!
ఈ విషయం పై బాగా ఆలోచించిన అనంతరం తమ బలగాలను ఉక్రెయిన్ కు మద్దతుగా పంపాలనుకున్నామని తెలిపారు.ఆ దేశానికి తాము సహాయం చేస్తున్నామంటే దానికి కారణం తమ పౌరులను కూడా రక్షించుకోవాలనే ఉద్దేశం మాత్రమే అని అన్నారు. ఉక్రెయిన్ కు సహాయం చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. పారిస్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో యుద్ధం విషయంలో అమెరికా అవలంభిస్తున్న విధానాల పై చర్చించడానికి ఈయూ దేశాల నేతలు పాల్గొనడానికి ముందు కీర్ స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దాడి చేయకుండా అడ్డుకునే...
త్వరలో తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలుస్తానని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. ఐరోపా,అమెరికా మధ్య బంధాలు బలపడడంలో బ్రిటన్ కీలక పాత్ర పోషిస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్ధతు చాలా అవసరం.పుతిన్ ఉక్రెయిన్ పై మరో దాడి చేయకుండా అడ్డుకునే సామర్థ్యం ట్రంప్ నకు మాత్రమే ఉంది అని అన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి ఫిబ్రవరి 24 కు మూడేళ్లు పూర్తవుతుండడంతో దానికి ముందు జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ,పోలాండ్,స్పెయిన్ నెదర్లాండ్స్ డెన్మార్క్ ప్రభుత్వాధినేతలు సమావేశమవ్వనున్నట్లు సమాచారం.
ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ..యూరీపోయిన్ యూనియన్ కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే సమయం వచ్చిందని అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యా ఆసక్తి చూపట్లేదని అసహనం వ్యక్తం చేశారు. అమెరికా సైనిక సాయం చేయకుండా తమ దేశం మనుగడ సాగించడం అసాధ్యమని..అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రదేశం తమకు సైనిక సహాయాన్ని ఆపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి యూరోపియన్ దేశాలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఈయూ దేశాలు అప్రమత్తమయ్యాయి.
Also Read: Bihar Earthquake: బాబోయ్ భూకంపం.. ఢిల్లీతో పాటు బీహార్‌లో కూడా: ఇళ్లలోంచి పరుగే పరుగు!