/rtv/media/media_files/2025/02/11/mg8exXSpRQIcRckkyYtp.jpg)
starmer
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జీ 7 దేశాల నాయకుల్లో బహిరంగంగా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానిగా నిలిచారు. ఈ విషయాన్ని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. హెచ్‌ఐవీ పరీక్ష వార్షికోత్సవం సందర్భంగా టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ తో కలిసి ప్రధాన మంత్రి స్టార్మర్ ర్యాపిడ్ హోమ్ టెస్టు చేయించుకున్నట్లు ప్రకటించింది.
Also Read: Sri Lanka: ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్ కట్.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?
An HIV test from home @10DowningStreet
— Terrence Higgins Trust (@THTorguk) February 10, 2025
Sir Keir Starmer has become the first Prime Minister and G7 leader to take a public HIV test, as part of National HIV Testing Week which starts today.
You can order a free, quick and easy HIV test now at https://t.co/B37EhUiS9G pic.twitter.com/FL8zON28IV
స్వయంగా టెస్ట్...
హెచ్‌వీఐ పరీక్ష (HIV Test) గురించి అవగాహన పెంచడానికి టెరెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ ప్రతినిధులు ముందుకొచ్చారు. వారితో కలిసి ఇంట్లోనే స్టార్మర్ రాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఇదిలా ఉంటే స్టార్మర్ స్వయంగా టెస్ట్ చేయించుకోవడం విశేషం. ఈ సందర్భంలగా దేశ ప్రజలంతా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: LUMPY SKIN VACCINE:లంపీ స్కిన్ వ్యాధి - టీకా కనుగొన్న భారత్ బయోటెక్
It’s my mission to end new HIV transmissions by 2030.
— Keir Starmer (@Keir_Starmer) February 10, 2025
You can get a HIV test delivered to your home. It’s free, quick and easy to do.#HIVTestingWeek pic.twitter.com/mrPkKZig5E
ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ..హెచ్‌ఐవీ పరీక్ష ఎంతో ముఖ్యమైనదని..అందులో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా, ఆనందంగా అనిపించిందని తెలిపారు. కొన్ని క్షణాల్లో పూర్తయ్యే ఈ పరీక్షను ఒక వారం పాటు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు.2030 నాటికి కొత్త హెచ్‌ఐవీ కేసులు పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్టార్మర్...ఆ లక్ష్యాన్ని చేరేందుకు ప్రజలు ముందుకొచ్చి పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
Also Read: Up: కుంభమేళా ఎఫెక్ట్..వాయిదా పడుతున్న హైకోర్టు కేసులు!