/rtv/media/media_files/2026/04/12/fotojet-44-2026-04-12-16-11-12.jpg)
Erdogan Israel Warning : ఇన్నాళ్లు తుర్కియేకు వార్నింగ్ ఇస్తూ వస్తున్న ఇజ్రాయెల్(iran israel war impact) కు తుర్కియే తొలిసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాలని, మళ్లీ పరిస్తితులు ఉద్రిక్తతకు దారి తీస్తే ఇజ్రాయెల్‌పై దాడి చేయటానికి ఏ మాత్రం వెనుకాడమని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. శాంతిని నెలకొల్పడం తమ కర్తవ్యం అని ఆయన అన్నారు.
The President of Turkey said,
— Iranian Force (@MrImranPk) April 12, 2026
“If war breaks out and Pakistan fails to establish peace, it is our duty to attack Israel.” pic.twitter.com/LrxgIULE12
Also Read : గజ గజ వణుకుతున్న ట్రంప్.. యుద్ధంలో ఇరాన్‌కు దొరికిన సీక్రెట్ వెపన్ ఇదే!
Turkey Warns Israel
కాగా, ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. అమెరికా పెట్టిన డిమాండ్లకు ఇరాన్ ఒప్పుకోకపోవటంతో చర్చలు విఫలమయ్యాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫేయిల్ అయ్యింది. ఇదిలా ఉండగానే తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్‌కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పాకిస్థాన్ పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించాలని.. లేదని మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీసే పరిస్థితి వస్తే.. ఇజ్రాయెల్‌పై దాడి చేయటం తమ కర్తవ్యం అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ మూలంగానే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ సమావేశంలో ఎర్డోగన్ మాట్లాడుతూ.. ‘మానవ విలువలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ఇష్టరీతిన దాడులు చేస్తోంది. లెబెనాన్ పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్నాను. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన రోజు కూడా ఇజ్రాయెల్ దాడులు చేయటం దారుణం. ‘జెనోసైడ్ నెట్‌వర్క్’లో భాగంగానే ఇజ్రాయెల్ ఈ దారుణాలకు పాల్పడుతోంది’ అని అన్నారు.
కాగా, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కేవలం ఇజ్రాయెల్‌కు మాత్రమే కాకుండా ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థలు రెండోసారి కూల్చివేశాయని, ఇలాంటి "తప్పుడు, రెచ్చగొట్టే చర్యలు" కొనసాగిస్తూ మధ్యప్రాచ్యాన్ని మళ్లీ గత శతాబ్దంలోలా యుద్ధభూమిగా మార్చేస్తామంటే ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ మాట్లాడుతూ, ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలను తుర్కియే నిశితంగా గమనిస్తోందని తెలిపారు. తమ ఆందోళనలను నేరుగా టెహ్రాన్‌కు తెలియజేశామని చెప్పారు. “ఇరాన్‌కు అవసరమైన హెచ్చరికలు ఇచ్చాం. అయినప్పటికీ వారు తప్పుదోవలోనే కొనసాగుతున్నారు” అని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు.
Also Read : అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన !
Follow Us