Trump: పూటకో మాట రోజుకో వేషం.. ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తున్న ట్రంప్

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేపట్టిన ఎపిక్ ప్యూరీ ఆపరేషన్ ఇప్పటివరకు 30 రోజులు దాటింది. ఈ ముప్పై రోజుల్లో యుద్ధంపై ట్రంప్ 300 వందల సార్లు మాట మార్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను కూడా షాక్‌కు గురిచేస్తోంది.

New Update
_trump

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేపట్టిన ఎపిక్ ప్యూరీ ఆపరేషన్ ఇప్పటివరకు 30 రోజులు దాటింది. ఈ ముప్పై రోజుల్లో యుద్ధంపై ట్రంప్(Donld Trump) 300 వందల సార్లు మాట మార్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(47th us president donald trump) అనుసరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను కూడా షాక్‌కు గురిచేస్తోంది. ఆయన తన ప్రకటనలను పదేపదే మారుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, చమురు నిల్వలు, యుద్ధం ముగింపు వంటి అంశాలపై ఆయన మాట రోజుకో వేషం వేస్తున్నాడు. వార్ విషయంలో ట్రంప్ సెకన్‌లో క్యారెక్ట్‌తో అపరిచితుడు సినిమా చూపిస్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

యుద్ధం ఆగింది ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని అంటాడు. అంతలోనే ఇరాన్‌ను వదిలేది లేదని వార్నింగ్ ఇస్తాడు. మళ్లీ ఇరాన్‌ ప్రజల స్వేఛ్చ కోసమే అక్కడి ప్రభుత్వాన్ని అంతం చేస్తున్నామని అంటాడు. క్షణాల్లోనే అక్కడి వాళ్లతో మాకు ఏ శత్రుత్వం లేదు, ఇరాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్‌ను నాశనం చేయడమే అమెరికా లక్ష్యం అంటాడు. వెంటనే మళ్లీ ఇరాన్ చమురు నిల్వలు అమెరికావే అని చెప్పుకొస్తాడు. ఇలా ట్రంప్ ఇరాన్‌పై యుద్ధంలో ఒక్క మాటకు కట్టుబడకుండా క్షణాల్లో ఆయన నిర్ణయాలు మార్చుకుంటున్నాడు(trump announcement). ట్రంప్ సడన్ సర్‌ప్రైస్‌లతో స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు గురైతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభం, అయోమయంలో ఉన్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ ఎన్ని వేషాలు వేశాడో చూద్దాం..

Also Read :  ట్రంప్ కళ్లు తెరిపించిన ఆర్మీ ఆఫీసర్.. ఎవరీ జనరల్ డాన్ కేన్?

1. టార్గెట్ న్యూక్లియర్ నిరోధమా? 

మొదట్లో: ఫిబ్రవరి 28న యుద్ధం ప్రకటించినప్పుడు, ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇరాన్‌లో యూరేనియం నిల్వలు ప్రపంచానికే ప్రమాదని అన్నాడు. వాటిని అంతం చేయడమే మా పని అని ట్రంప్ చెప్పాడు.
ఇప్పుడు: మార్చి చివరలో తన మాట మార్చారు. "అణు కేంద్రాలు భూమికి చాలా లోతులో ఉన్నాయి, వాటి గురించి నాకు పట్టింపు లేదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు ముప్పు కేవలం ఇజ్రాయెల్, అరబ్ దేశాలకే అని, దాన్ని అడ్డుకోవడానికి ఆ దేశాలే ఖర్చు పెట్టుకోవాలని, అమెరికా ఎందుకు తన రక్తాన్ని చిందించాలని ప్రశ్నించారు.

2. ప్రభుత్వ మార్పపై ద్వంద వైఖరి 

మొదట: యుద్ధం ప్రారంభమైన కొత్తలో, ట్రంప్ ఇరాన్ ప్రభుత్వమే లక్ష్యంగా మాట్లాడారు. ఇరాన్ నాయకత్వాన్ని కూలదోసి, అక్కడ ప్రజాస్వామ్య అనుకూల ప్రభుత్వాన్ని తీసుకురావడమే అమెరికా అంతిమ లక్ష్యమని పలుమార్లు సూచించారు.

ఇప్పుడు: కానీ, మార్చి చివరలో తన స్వరాన్ని మార్చి, "అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని మార్చుకోలేకపోతే అది వారి సమస్య, నాకు దానితో సంబంధం లేదు" అని వ్యాఖ్యానించడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది.

3. హోర్ముజ్ జలసంధి విషయంలో 

యుద్ధం మొదట్లో: హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ఊరుకోమని, దానిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధిస్తుందని గంభీరంగా ప్రకటించారు.

మార్చి 31: హఠాత్తుగా "మా దగ్గర పుష్కలంగా చమురు ఉంది, మాకు ఆ జలసంధితో సంబంధం లేదు. చమురు కావాల్సిన దేశాలే (చైనా, జపాన్, బ్రిటన్) వెళ్లి యుద్ధం చేసి తెచ్చుకోవాలి" అని షాకిచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 1న, "జలసంధి తెరవకపోతే ఇరాన్‌ను రాతి యుగంలోకి నెట్టేస్తాం" అని మళ్ళీ బెదిరించారు.

4. యుద్ధంపై కీలక ప్రకటనలు

మార్చి 2: యుద్ధం కేవలం 4 నుండి 5 వారాల్లో ముగుస్తుందని టైమ్ లైన్ ఇచ్చారు.
మార్చి మధ్యలో: అమెరికా వద్ద అపరిమితమైన మందుగుండు సామాగ్రి ఉందని, యుద్ధాలను "ఎప్పటికీ" కొనసాగించగలమని సోషల్ మీడియాలో రాశారు. మళ్ళీ ఏప్రిల్ 1న, యుద్ధం "దాదాపు పూర్తయింది" అని ప్రకటించి అందరినీ అయోమయంలో పడేశారు.

5. తేల్చుకుందాం రా : కాల్చుకుందాం రా

మార్చి 20: "నాకు కాల్పుల విరమణ ఇష్టం లేదు" అని విలేకరులతో చెప్పారు.
మార్చి 25: ఇరాన్‌కు 15 అంశాలతో కూడిన 'కాల్పుల విరమణ' ప్రతిపాదనను పంపినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చర్చలంటూనే అమెరికా ఇరాన్‌పై దాడులు చేస్తోంది.

6. నాటో మిత్రదేశాలపై ఆగ్రహం

మొదట: యుద్ధం మొదలైనప్పుడు ఐరోపా దేశాల మద్దతు కోరిన ట్రంప్, ఇప్పుడు మాట మార్చారు. మిత్రదేశాలపై ట్రంప్ ప్రసంశలు కురింపిచాడు.

ఇప్పుడు: ఇరాన్ దాడుల వల్ల హోర్ముజ్ జలసంధి మూతపడితే ఐరోపాకే ఎక్కువ నష్టమని, కాబట్టి ఆ దేశాలే తమ నౌకాదళాలను పంపి యుద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. "మాకు చమురు అవసరం లేదు, మీరు చమురు తెచ్చుకోవడానికి అమెరికా రక్తం ఎందుకు చిందించాలి?" అని ఆయన ప్రశ్నించడం నాటో మిత్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరాన్ యుద్ధంలో తనకు సహకరించని దేశాలపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొద ఏప్రిల్ 1న రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమెరికా 'నాటో' కూటమి నుండి తప్పుకోవడాన్ని పరిశీలిస్తానని బాంబు పేల్చారు. 

Also Read :  హార్మూజ్ తెరిస్తేనే శాంతి.. లేదంటే సర్వనాశనమే: యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన!

7. సైనిక నష్టాలు

మొదట: యుద్ధం ప్రారంభంలో అమెరికా దళాలకు ఎటువంటి నష్టం జరగలేదని, అన్నీ మన అదుపులోనే ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు.

తర్వాత: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో F-35 యుద్ధ విమానాలు కూలిపోయినట్లు, ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిగినట్లు వార్తలు రావడంతో, "కొన్ని చిన్నపాటి నష్టాలు జరిగాయి కానీ అవి యుద్ధంలో సహజం" అని మాట మార్చారు. అంతేకాదు యూస్ ఆర్మీ ఆఫీసర్ల మరణాలను కూడా ట్రంప్ అంగీకరించాడు.

జనరల్ డాన్ కేన్ సలహా మేరకు ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకున్నారని కొందరు అంటుంటే, ఆయన అస్థిరత్వ నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను మరియు చమురు ధరలను అతలాకుతలం చేస్తున్నాయని విమర్శకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆయన మాట ప్రకారం, మరో రెండు వారాల్లో అమెరికా సైన్యం ఇరాన్ నుండి వెనక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది, కానీ ఆయన మళ్ళీ ఎప్పుడు మాట మారుస్తారో ఎవరూ ఊహించలేకపోతున్నారు.

Advertisment
తాజా కథనాలు