/rtv/media/media_files/2025/01/21/wH3rIKHbGfb6xXMmc87o.jpg)
USA New President Donald Trump
అమెరికా అధ్యక్షుడి చేతిలో అత్యంత పవర్ ఫుల్ ఆయుధం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు. కాంగ్రెస్ లేదా చట్టసభలతో సంబంధం లేకుండా, వాటి ఆమోదం అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖిత పూర్వక ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు. దాదాపు ప్రతీ అధ్యక్షుడు వీటిని వాడుకుంటారు. అమెరికా పాలనకు, ప్రభుత్వ విధానాలకు సంబంధించి కీలక నిర్ణయాలను అధ్యక్షుడు వీటిని తీసుకుంటారు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ II ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసే అధికారం యూఎస్ ప్రెసిడెంట్‌కు ఉంటుంది. ఈ ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది. సాధారణంగా జారీచేసే అధికారిక ప్రకటన లాంటి వాటికి మాత్రం ఉండదు. వీటిని తిరస్కరించే అవకాశం అమెరికన్ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు ఉంటుంది. అయితే వీటో అధికారం మాత్రం ఎప్పుడూ అధ్యక్షుని చేతిలోనే ఉంటుంది. అందుకే తెలివిగా కాంగ్రెస్ వేటినైతే అమోదించదు అని అనుకుంటారో వాటిని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల కింద వాడుకుంటారు ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నవారు. అయితే వీటికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని మాత్రం అధ్యక్షుడు మీరకూడదు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల విషయంలో అధ్యక్షుడిని కాంగ్రెస్ తిప్పలు పెట్టొచ్చు. ఆ నిర్ణయాలకు అవసరమైన నిధులను ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా మరే ఇతర అడ్డంకులను అయినా సృష్టించే అవకాశం మాత్రం ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల వల్ల ఉపయోగాలు..
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా అమెరికా అధ్యక్షుడు తనకు కావాల్సిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అలాగే యుద్ధాల్లాంటివి జరిగినప్పుడు సంక్షోభాల నివారణ చేయడానికి ఈ ఆదేశాలు జారీ చేయొచ్చు. 1942లో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రుజ్‌వెల్ట్ జారీ చేసిన ఆదేశాలు.. 1.20 లక్షల జపనీస్ అమెరికన్ల కోసం నిర్బంధ కేంద్రాల ఏర్పాటు అయ్యేలా చేసింది. అమెరికాలో ఇప్పటికే వేల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ అందరికన్నా అత్యధికంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకాలు చేశారని చెబుతారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొత్తం 220 ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఇక గత ప్రభుత్వంలో బైడెన్ 160 ఆర్డర్ల మీద సంతకం చేశారు. అయితే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజే ట్రంప్ వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేయడం మాత్రం రికార్డ్ అనే చెప్పాలి. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద న్యాయపరంగా కోటుకు వెళ్ళవచ్చును. చట్టపరిధిని దాటి అధ్యక్షుడు ఏమైనా చేస్తే కాంగ్రెస్‌తో పాటూ కోర్టు కూడా వీటిని సవాల్ చేయవచ్చును.
Also Read: Kolkata: సంజయ్ రాయ్ శిక్షపై మమతా సర్కార్ అసంతృప్తి..కీలక నిర్ణయం