/rtv/media/media_files/2025/04/03/9FVaTTkVR8tpsbGzExCD.jpg)
trump tax on india Photograph: (trump tax on india)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పలు మార్కెట్లు కుదేలయ్యాయి.అగ్రరాజ్య మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. మరోవైపు ఈ ఆర్థిక అనిశ్చితులతో మాంద్యం తప్పదనే భయాలూ కూడా వెంటాడుతున్నాయి. ఈ పరిణామాలపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్!
టారిఫ్ లపై తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్న ఆయన..అమెరికా సుసంపన్నం కావడానికి ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. మార్కెట్ల పతనం పై ఆయన తన ట్రూత్ సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. అమెరికాలోకి చాలా మంది ఇన్వెస్టర్లు వస్తున్నారు.పెద్దమొత్తంలోపెట్టుబడులు పెడుతున్నారు.దీని పై నా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండబోదు.
Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!
మునుపెన్నడూ లేని విధంగా ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం అని ట్రంప్ రాసుకొచ్చారు. పెద్దపెద్ద వ్యాపారులు ఈ టారిఫ్ లతో ఎలాంటి ఆందోళన చెందట్లేదు.ఎందుకంటే వారు ఇక్కడే ఉంటారని వారికి తెలుసు.మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశం పై వారు దృష్టిపెట్టారు. ఇదే చాలా ముఖ్యం అని ట్రంప్ మరో పోస్ట్ లో వెల్లడించారు.
భారత్ సహా పలు దేశాల పై ట్రంప్ సుంకాల మోత మోగించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నాటి ట్రేడింగ్ లో భారీగా క్షీణించిన అమెరికా మార్కెట్లు శుక్రవారం కూడా మరింత పతనమయ్యాయి.డోజోన్స్ 5.5 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 5.97 మేర నష్టపోయాయి. ఈ రెండు రోజుల్లో అమెరికా మార్కెట్ విలువ ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది.ఈ పరిణామాలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తాయని ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Hyderabad: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం!
Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్!
trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates