/rtv/media/media_files/2025/01/11/d0rSPWBG9KtCwiAyLAbT.jpg)
Donald Trump, Vladimir Putin
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించడానికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు వచ్చినా విడిచిపెట్టేదే లేదు అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించి పుతిన్ కు ట్రంప్ ఫోన్ చేశారు. సుమారు రెండు గంటలకు పైగా చర్చలు కొనసాగాయి అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ట్రంప్ ముందుగానే చెప్పారు. పుతిన్‌తో తాను మాట్లాడతానని, భూమి, విద్యుత్కేంద్రాల గురించి, కొన్ని ఆస్తుల విభజనపైనా ఇద్దరం చర్చిస్తామని చెప్పారు. అవే విషయాలు ఇప్పుడు మాట్లాడినట్టు సమాచారం.
రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధం ముగిస్తాయని రెండు దేశాలు చెప్పాయి. ఇందులో భాగంగా ఆయన ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. పుతిన్ కూడా అంగీకారం తెలిపారు. కానీ కొన్ని ఇంకా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం కూడా ట్రంప్ పుతిన్ తో...దీనికి సంబంధించే చర్చలు జరిపారు మూడేళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపానని తెలిపారు. అలి సఫలమైనట్లు పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం ఆపదలో ఉందని చెప్పిన ట్రంప్.. వాళ్ల ప్రాణాలను కాపాడాలని పుతిన్‌ను కోరినట్లు చెప్పారు. రక్తపాతం సృష్టిస్తున్న ఈ యుద్ధం ఎట్టకేలకు ముగిసే ఛాన్స్ ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే వేలాది మంది ఉక్రెయిన్ బలగాలను రష్యా సైన్యం చుట్టుముట్టింది. ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యం ఆపదలో ఉంది. వాళ్ల ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను గట్టిగా అభ్యర్థించాను. లేకపోతే ఇది రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఎవరూ చూడని భయంకరమైన ఊచకోతగా మారే ఛాన్స్ ఉంది. వాళ్లకి భగవంతుడు అండగా ఉండాలని ఆశిస్తున్నానని'' డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్య వేదికగా అయిన ట్రూత్ సోషల్‌లో తెలిపారు.