/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/bangladesh.jpg)
బంగ్లాదేశ్ లో గతేడాది జూలై, ఆగస్టు మధ్యల్లో విపరీతమైన అల్లర్లు చెలరేగాయి. తరువాత ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌లో 88సార్లు మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగాయి. దీని వలన అక్కడి ప్రభుత్వమే పడిపోయింది. దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయారు. ఇందులో ఎక్కువగా దాడులు హిందువుల మీదనే జరిగాయని చెబుతోంది ఐక్యరాజ్యసమితి. ఇందులో జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్యలో జరిగిన విద్యార్థలు ఆందోళనల్లో మొత్తం 1400 మంది మృతి చెందారని...వారిలో 13శాతం చిన్నారులే అని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపింది. బంగ్లాదేశ్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల కారణంగానే ఎక్కువ మంది మరణించారంది. దీనికి షేక్ హసీనా ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పింది.
మైనారిటీల మీద దాడులు..
ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక...యూనస్ ఖాన్ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఠాకుర్‌గావ్, లాల్‌మొనిర్‌హట్, దినాజ్‌పుర్, సిల్హెట్, కుల్నా, రంగ్‌పుర్ వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి.మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 3000-4000 మంది హిందువులు భారత్ సరిహద్దుకు చేరుకుని అక్కడ ఆశ్రయం పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. దీనికి సంబంధించి హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అండ్ అబ్యూజెస్ రిలేటెడ్ టూ ద ప్రొటెస్ట్స్ ఆఫ్ జులై అండ్ ఆగస్టు 2024 ఇన్ బంగ్లాదేశ్ పేరున..ద ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్యాక్ట్-ఫైండింగ్ నివేదికను రూపొందించింది. బంగ్లాదేశ్ లో దాడులకు ఎక్కువగా పాల్పడిన వారు అక్కడి నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఏ ఇస్లామీ లాంటి మత సంస్థలేనని నివేదికలో చెప్పింది. దాడులు కేవలం హిందువుల మీదనే కాక..అక్కడి అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవుల మీద కూడా జరిగిందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.