IRAN WARNS US EXPLAINER : మిడిల్ ఈస్ట్‌లో మరోసారి టెన్షన్‌ టెన్షన్...ఇరాన్‌, అమెరికా మధ్య మాటల వార్‌

పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్,ఇరాన్ మధ్య ముదిరిన వైరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు నిల్వలపై దాడుల దిశగా మలుపు తిరిగింది.

New Update
Iran US War

Iran US War

IRAN WARNS US EXPLAINER :  పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఇరాన్(Iran Warns US Strikes) మధ్య ముదిరిన వైరం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు నిల్వలపై దాడుల దిశగా మలుపు తిరిగింది. ఇరాన్ చమురు పైప్‌లైన్లపై దాడులు చేస్తామన్న ట్రంప్ హెచ్చరికలకు, ఇరాన్ తనదైన శైలిలో స్పందించింది.

ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ ప్రతిసవాల్
టెహ్రాన్‌లోని చమురు పైప్‌లైన్‌లను పేల్చేస్తామని, అప్పుడే ఇరాన్ దారిలోకి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనిపై ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సాహెబ్ ఇస్ఫహానీ తీవ్రంగా స్పందించారు. అమెరికా తన చమురు బావులపై ఒక్క దాడి చేస్తే, తాము ప్రతిగా అమెరికా మిత్రదేశాలలోని నాలుగు చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తమ లెక్కలు వేరేలా ఉంటాయని, ఒకటికి నాలుగు రెట్ల విధ్వంసాన్ని చూపిస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆస్తులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళన మొదలైంది.

Also Read :  FTA : భారత్-న్యూజిలాండ్ మైత్రి... కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

ఇరాన్ టార్గెట్‌లో ఉన్న నాలుగు కీలక చమురు క్షేత్రాలు

1. ఘవార్ ఆయిల్‌ ఫీల్డ్ (సౌదీ అరేబియా)

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రం. రోజుకు సుమారు 35 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేసే ఈ ఫీల్డ్‌పై దాడి జరిగితే ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది చావుదెబ్బ తీస్తుంది.

2. బుర్గాన్‌ ఆయిల్ ఫీల్డ్ (కువైట్)

ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు క్షేత్రమైన దీనిపై దాడి జరిగితే కువైట్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. గల్ఫ్ ప్రాంతంలో షిప్పింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమై, చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది.

3. రుమలిలా ఆయిల్‌ ఫీల్డ్ (ఇరాక్)

రోజుకు 14 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేసే ఈ క్షేత్రంపై దాడి జరిగితే ఇరాక్ రాజకీయ స్థిరత్వం దెబ్బతింటుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన బీపీ (BP), సీఎన్‌పీసీ (CNPC) వంటి అంతర్జాతీయ సంస్థలపై నేరుగా ప్రభావం పడుతుంది. ఇది అమెరికా మిత్రదేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.

4. జాకుమ్‌ ఆయిల్ ఫీల్డ్ (యూఏఈ)

సముద్ర గర్భంలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రం ఇది. దీనిపై దాడి జరిగితే గల్ఫ్ సముద్ర మార్గాలకు పెను ప్రమాదం వాటిల్లుతుంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన 'హార్మూజ్ జలసంధి' (Strait of Hormuz) గుండా ఓడల రాకపోకలు నిలిచిపోయి ప్రపంచ ఇంధన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.

అమెరికా తన మిత్రదేశాల అండతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని చూస్తుంటే, ఇరాన్ మాత్రం ఆ మిత్రదేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని హెచ్చరిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.

Also Read :  చావు అంచుకు వెళ్లి, భూమిని గడ్డకట్టించి .. యురేనియం ఎలా భయటకు తీస్తారో తెలుసా?

Advertisment
తాజా కథనాలు