అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లను భూమి మీదకు రప్పించడానకి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బారీ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో నాసా ఆస్ట్రోనాట్స్ 10 రోజుల మిషన్ కోసం 2024 జూన్ 5న బయలుదేరారు. తిరిగిరాడానికి వారి క్యాప్సుల్ ఫెయిల్ అయ్యింది. దీంతో 9 నెలలుగా సునీతా విలియన్స్, బారీ విల్మోర్‌లు అక్కడే చిక్కుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతలు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్‌కు అప్పగించారు.
Also read: Earthquake: భూకంపం రాకను ముందే పసిగట్టొచ్చు.. జపాన్ శాస్త్రవేత్తల మరో ముందడుగు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ సెంటర్‌లో చిక్కుకున్న వారి గురించి శుక్రవారం మాట్లాడారు. సునీతా విలియమ్స్‌పై గురించి జోకులు వేస్తూ.. గుడ్ సాలిడ్ హేర్ అని పేర్కొన్నారు. అంటే మంచి గట్టి జుట్టు గల వ్యక్తిగా ట్రంప్ సునీతా విలియమ్స్‌ను అభివర్ణించాడు. మార్చి 16న వారిని తిరిగి తీసుకొచ్చే ప్రయాత్నాలు జరుగుతున్నాయి. మార్చి 10న స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో నాసా టీం వారిని భూమిమీదకు తీసుకురావడానికి వెళ్లనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. మార్చి 16న వీరిద్దరూ భూమికి తిరిగి వస్తారని నాసా అధికారులు తెలిపారు.
Also read: farmhouse meeting: KCR ఫామ్ హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే హాస్పిటల్‌పాలు
2024 సెప్టెంబర్‌లో ఇద్దరూ ఆస్ట్రోనాట్స్‌ను తీసుకురావడానికి స్టార్‌లైనర్ స్పేస్‌షిప్ వెళ్లింది. కానీ.. సునీతా విలియమ్స్, విల్మోర్లు కిందకి రాలేదు. నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మోస్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లను స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌లో పంపించారు. డ్రాగన్ అంతరిక్ష నౌకలో రెండు సీట్లు ఖాళీగా ఉంచి పంపించారు. అయినా ఫలితం లేకపోయింది. ఫస్ట్ 2025 ఫిబ్రవరిలో సునీతా, విల్మోర్ లను భూమి మీదకు తీసుకురావాలని షెడ్యూల్ చేశారు. అది మార్చి 16కు వాయిదా పడింది. నాసా వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, రోస్కోస్మోస్ కిరిల్ పెస్కోవ్‌లతో కలిసి మార్చి 12న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి క్రూ-10 స్పేస్‌షిప్ ప్రయోగించనున్నారు.