/rtv/media/media_files/2025/12/08/starlink-price-revealed-ahead-of-india-launch-2025-12-08-14-50-58.jpg)
Starlink price revealed ahead of India launch
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన స్టార్‌లింక్ సేవలు భారత్‌లోకి రానున్నాయి. మన దేశంలోని టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌తో ఇప్పటికే స్టార్‌లింక్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే భారత్‌లో స్టార్‌లింక్ కమర్షియల్ సేవలు అందించనుంది. ఈ మేరకు ఆ సంస్థ నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలను వెల్లడించింది. స్టార్‌లింక్ ఇండియా వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలు పొందుపర్చారు.
Also Read: అంతర్జాతీయ హంగులతో గ్లోబల్ సమ్మిట్..ప్రత్యేకతలివే...
Starlink Price Revealed Ahead Of India Launch
స్టార్‌లింక్ సేవలు పొందాలంటే రెసిడెన్షియల్ వినియోగదారులు నెలకు రూ.8600 చెల్లించాలి. హార్డ్‌వేర్ కిట్‌కు అదనంగా రూ.34 వేలు చెల్లించాలి. ఈ ప్యాకేజీలో శాటిలైట్ డిష్, వైఫై రౌటర్, మౌంటింగ్ స్టాండ్, పవర్ అడాప్టర్, కేబుల్స్‌తో కూడిన ప్లగ్ అండ్ ప్లే కిట్‌ను కస్టమర్లకు ఇవ్వనున్నారు. ఈ ప్లాన్‌తో అపరిమిత డేటాతో సహా 30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్స్ సదుపాయం ఉంటుంది. 99.9 శాతం కంటే ఎక్కువ నెట్వర్క్ అప్‌టైమ్‌తో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇంటర్నెట్ సేవలు క్రమంగా అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు దీన్ని కోనుగోలు చేసిన వెంటనే ప్లగ్ ఇన్ చేసి సేవలు ప్రారంభించుకోవచ్చు.
Also Read: వందేమాతరానికి 150 సంవత్సరాలు..ప్రత్యేకతలు..వివాదాలు..పార్లమెంట్లో చర్చ..
Starlink has rolled out its plans for India🇮🇳
— Vivek Panwar (Tech Dekhoji ❤️ Media) (@TechDekhoji) December 8, 2025
1 time Hardware kit- 34,000/-
Monthly plan- 8600/M
Currently for unlimited high speed data we are trusting Broadband connection which is weather proof
H/w is almost FREE or 1500/-
Plans 9000/year for 200Mbps with FUP limit in Surat pic.twitter.com/e53xB9bjOb
Follow Us