/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/zelensky-jpg.webp)
మూడేళ్లుగా ఉక్రెయిన్ -రష్యా ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యుద్ధం ముగింపు పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలను రష్యా అధ్యక్షుడు పుతిన్ తోసిపుచ్చారు.దీని పై జెలెన్ స్కీ స్పందిస్తూ బలమైన నాయకులన్నా..చర్చలన్నా పుతిన్ కు భయమని తెలిసిపోయిందని అన్నారు.
Also Read: Maha Kumb Mela: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బలమైన నాయకులకు , చర్చలకు పుతిన్ భయపడతారని మరోసారి తేలిపోయింది. యుద్ధాన్ని పొడిగించడానికి ఆయన సాధ్యమైనంత ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వేసే ప్రతి పని కూడా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేవిగా ఉంటాయి. 2014 లో రష్యా మాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించింది.
2022 లో అది పూర్తి స్థాయి దండయాత్రగా మారింది. ప్రస్తుతం శాంతిని సాధించే అవకాశం ఉన్నప్పటికీ..ఆయన ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ప్రపంచంలో స్థిరత్వానికి భంగం కలిగించేందుకు ఆయన వద్ద సామర్థ్యాలు నిండుగా ఉన్నాయి. కానీ, బలమైన నాయకుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేనంత బలహీనంగా ఉన్నారు.
Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!
అందుకే మనం నిర్ణయాత్మకంగా , ఐక్యతతో వ్యవహరించాలి. శాంతిని విశ్వసించేవారంతా కలిసి రష్యా పై ఒత్తిడి పెంచాలి. అప్పుడే మనం నిజమైన శాంతిని పొందగలం అని జెలెన్ స్కీ అన్నారు. రష్యా ఉక్రెయిన్ ల మధ్య శాంతిని నెలకొల్పే చర్చలు సాధ్యమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. అయితే జెలెన్ స్కీతో ఇది కుదరదని వ్యాఖ్యానించారు.
చర్చలు జరిపి, రాజీపడాలనే కోరిక ఉంటే అందుకు మేము సిద్ధం. కానీ ,ఆ దేశాధ్యక్షుడితో మాత్రం చర్చలు సాగవు. మా ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రయత్నాలుంటాయి. పాశ్చాత్య దేశాలు కీవ్ కు మద్దతు నిలిపివేస్తే ఈ పోరాటం రెండు నెలల్లోనే ముగిసిపోతుంది అని పుతిన్ తెలిపారు. దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఆయన మాట్లాడుతూ యుద్ధం అనేది అసలు మొదలుకాకూడదని..తానుఅధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ లో సంక్షోభం వచ్చేది కాదన్నారు.త్వరలోనే దీనికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. శాంతి చర్చలకు ఇరు దేశాధ్యక్షులు ముందుకు రావాలన్నారు.అయితే కీవ్ లో శాంతి ఒప్పందం పై చర్చలకు రష్యా రాకపోతే వారి పై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు.
Also Read: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!
Also Read: Hussain Sagar Boat Fire: హుస్సేన్‌సాగర్‌లో బోటు ప్రమాదం.. అజయ్ మృతదేహం లభ్యం