/rtv/media/media_files/2026/04/22/power-shift-in-iran-2026-04-22-14-55-43.jpg)
Power shift in Iran ? IRGC sidelines president
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో(america israel war) ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ(Mojtaba) తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌ను ఎవరు నడిపిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఉన్నప్పటికీ ఆయనకు అధికారం దూరమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇస్లామిక్ రివల్యుషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇరాన్ పగ్గాలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ దేశ పాలనకు సంబంధించి ఏ నిర్ణయాలైన IRGC తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: క్షిణించిన డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం.. సోషల్ మీడియాలో వైరల్ ?
Power Shift In Iran IRGC Sidelines President
పెజెష్కియాన్ చేపట్టిన నియామకాలను కూడా IRGC అడ్డుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సైనిక దళం మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ ఒత్తిడి వల్ల నిఘా మంత్రిని నియమించాలని అధ్యక్షుడు ప్రయత్నించగా అది విఫలమైనట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. యుద్ధం నెలకొన్న నేపథ్యంలో కీలక పదవులను ఎవరికి అప్పగించాలో మేమే బాధ్యత తీసుకుంటామని వహీద్ పట్టుబడుతున్నట్లు పేర్కొంది. దీనివల్ల ఇరువర్గాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు చెప్పింది. మొజ్తాబా ఖమేనీ చుట్టు IRGC ఓ వలయంలా ఏర్పడినట్లు ప్రచారం నడుస్తోంది.
మొజ్తాబా ఖమేనీకి చేరవేయాల్సిన ప్రభుత్వ రిపోర్టుల విషయంలో కూడా IRGC తన పట్టు ప్రదర్శిస్తు్న్నట్లు తెలుస్తోంది. పెజెష్కియాన్ అత్యవసర మీటింగ్ కోసం యత్నించినా అది సాధ్యం అవ్వడం లేదు. ఈ పరిణామాలను IRGC స్వాధీనంగా చూడొద్దని, తిరుగుబాటుగా భావించొద్దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఇరాన్ అధికారంలో క్రమంగా జరుగుతున్న మార్పుగా సూచిస్తున్నారు.
Also Read: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. డీల్ కుదరకపోతే యుద్ధమేనని ట్రంప్ హెచ్చరిక
మరోవైపు IRGC సంచలన హెచ్చరికలు చేసింది. తమ శత్రువులకు సాయం చేసే దేశాలు (గల్ఫ్ దేశాలనుద్దేశించి) చమురు ఉత్పత్తిని మర్చిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ భూభాగాలు వాడుకునేందుకు పలు దేశాలు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Follow Us