Air Pollution: ప్రపంచవ్యాప్తంగా విషపు గాలి.. కాలుష్యంలో నెంబర్ 1 దేశంగా పాకిస్థాన్‌.. భారత్‌ స్థానం ఎంతంటే ?

వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ మంగళవారం ప్రపంచ దేశాల వాయు నాణ్యత జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.

New Update
pakistan-ranked-most-polluted-country-in-2025

pakistan-ranked-most-polluted-country-in-2025

ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ మంగళవారం ప్రపంచ దేశాల వాయు నాణ్యత జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన పరిమితి కన్నా పీఎం (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) 2.5 కణాల స్థాయిలు పాక్‌లో 11 రేట్లు ఎక్కువగా ఉన్నట్లు ఐక్యూఎయిర్ తెలిపింది. గాలి కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నట్లు పేర్కొంది. 

Also Read: కారుణ్య మరణం పొందిన హరీష్ రాణా ఇక లేరు..ఎయిమ్స్‌లో తుదిశ్వాస!

పాక్‌ తర్వాత అత్యంత కలుషితమైన దేశాలుగా బంగ్లాదేశ్‌ రెండో స్థానంలో, తజికిస్థాన్ మూడో స్థానాల్లో నిలిచాయి. ఇక భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 143 దేశాల్లో గాలి నాణ్యత పరీక్షలు చేశారు. ఇందులో ఏకంగా 130 దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయు నాణ్యత ప్రమాణాలు అమలు చేయడంలో ఫెయిల్ అవ్వడం గమనార్హం. 

Also Read: యుద్ధం ఆపేందుకు చర్చలకు సిద్ధమంటున్న ఇరాన్.. అమెరికా ముందుకు ఈ డిమాండ్స్‌ !

ఇదిలాఉండగా.. ప్రపంచంలో అత్యంధికంగా కాలుష్యం ఉన్న నగరాల లిస్ట్‌ 2025లో ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న 'లోని' నగరం మొదటి స్థానంలో ఉంది. ఈ నగరం ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. ఇక్కడ పీఎం 2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 112.5 మైక్రోగ్రాములుగా ఉంది. ఇర రెండో స్థానంలో చైనాలో హోటాన్ సిటీ నిలిచింది. ఇక్కడ పీఎం 2.5 సాంద్రత క్యూబిక్ మీటర్‌కు 109.6 గ్రాములుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కేవలం 14 శాతం నగరాల్లోనే WHO నిర్దేశించిన వాయు నాణ్య ప్రమాణాలను అనుసరించాయి. ఇందులో ఆస్ట్రేలియా, పనామా, ఎస్టోనియా, ఐస్‌లాండ్‌లోని పలు నగరాలు ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు