Earthquake: చైనా, టిబెట్ భూకంపాలు...ఇప్పటివరకు 53 మంది మృతి

టిబెట్‌ను ఈరోజు ఉదయం భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్ మీద 7.1 తీవ్రతతో సంభవించిన ఈ ఆరు భూకంపాలలో ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దాంతో పాటూ భారత్, నేపాల్, భూటాన్‌లోని పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి.

author-image
By Manogna alamuru
New Update
టిబెట్

టిబెట్‌లో ఎర్త్‌క్వాక్‌కు కూలిపోయిన ఇళ్ళు

నేపాల్‌లో తెల్లవారు జామున భారీ భూకంపం (Earthquake) సంభవించింది. నేపాల్‌లోని గోకర్ణేశ్వర్ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 7.1 నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు అయిన లబుచేకు 93 కి.మీ దూరంలో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాలపై పడింది. ఢిల్లీలతో పాటు బిహార్‌లోని మోతిహారి, సమస్తిపూర్, దర్భంగా, మధుబని, పూర్నియా, సివాన్, అరారియా, సుపాల్, ముజఫర్‌పూర్‌లోని పలు జిల్లాల్లో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. మరోవైపు చైనాలోని షిగాట్సే నగరంలో కూడా 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

Also Read: America: భీక‌ర‌ మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!

Also Read :  మహారాష్ట్రలో రెండు హెచ్‌ఎంపీవీ వైరస్‌ కేసులు

36 మంది మృతి...

టిబెట్‌ (Tibet) లో అన్నిటికంటే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీని కారణంగా కనీసం 53 మంది చనిపోయారని రాయిటర్స్ చెబుతోంది. మరోవైపు చైనా (China) కు చెందిన జిన్హువా వార్తా సంస్థ 32 మంది చనిపోయినట్లుగా నివేదించింది. ఇక చైనాలో కూడా తొమ్మిది మంది మరణించారు. నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జిజాంగ్‌లో ఉదయం 6:35 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.1 గా నమోదయింది. ఆ తరువాత టబెట్‌లో రెండవ అతిపెద్ద నగరమైన షిగాట్సే నగరంలో పెద్ద భూకంప వచ్చింది. దీని తీవ్రత రెక్టార్ స్కేలుపై .8గా నమోదయిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపాల కారణంగా ప్రాణ నష్టంతో పాటూ ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగంది. అనేక భవనాలు నేలకూలాయి.

 

 

Also Read: USA: అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్

Also Read :  ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో

Advertisment
Advertisment
Advertisment