Bill Gates: ఏఐ వచ్చినా..ఆ ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేదు: బిల్‌ గేట్స్‌!

ఏఐ ధాటికి తట్టుకుని మూడు వృత్తులు నిలబడతాయని బిల్‌గేట్స్‌ అన్నారు. కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌,బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు.సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే లక్షణాన్ని ఏఐ సొంతం చేసుకోలేదన్నారు.

New Update
billgates

billgates

కృతిమ మేధ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుండగా..వాటి వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రముఖ సంస్థల అధినేతలు వివరిస్తున్నారు. ఇదే అంశం పై తాజాగా మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ స్పందించారు.ఏఐతో రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు నిరుపయోగంగా మారుతాయని అన్నారు. 

Also Read: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!

మిగతా వాటితో పోల్చుకుంటే..మూడు వృత్తులకు మాత్రంఈ ఆటోమేషన్‌ ముప్పు కాస్త తక్కువని అంచనా వేశారు. కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌,బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు.సమస్యలు పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే లక్షణాన్ని ఏఐ ఇంకా సొంతం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.

Also Read: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

ఏఐతో కోడింగ్‌ ఉద్యోగాలు పోవచ్చనే ఆందోళన ఉంది.కోడ్‌ ను రూపొందించడంలో కొన్ని ప్రోగ్రామింగ్ టాస్క్‌ లకు మనుషుల అవసరం లేకుండా ఏఐతో పని కానియోచ్చు.కానీ కచ్చితత్వం,లాజిక్‌, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాల్లో మాత్రం మనుషుల కంటే వెనకబడే ఉంది. క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ఈ లక్షణాలన్నీ కావాలి మరి.

డీబగ్గింగ్‌,ఏఐను మెరుగుపర్చడంలో ప్రోగ్రామర్స్‌ కీలకమని బిల్‌ గేట్స్‌ అభిప్రాయపడుతున్నారు. చాట్‌ జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ కోడ్‌ రాయడంలో ఉపయోగపడతాయి. అనుకోకుండా వచ్చే సవాళ్లను పరిష్కరించాలంటే ప్రోగ్రామర్స్‌ అవసరం ఉంటుందని చెప్పారు. అలాగే ఎనర్జీ రంగ నిపుణులను ప్రస్తుతానికి ఏఐ ఢీకొట్టలేదని గేట్స్ అంటున్నారు.వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, స్థిరమైన పరిష్కారాలను అమలు చేయడం, విద్యుత్ అంతరాయాలు, వనరుల కొరత వంటి సంక్షోభాలను పరిష్కరించడానికి మానవ నైపుణ్యం చాలా ముఖ్యమైందని స్పష్టం చేస్తున్నారు.

ఏఐలా కాకుండా..ఆ రంగ నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరని చెప్పారు. వారు నైతికతను, పర్యావరణ అంశాలు పరిగణనలోకి తీసుకుంటారన్నారు.అలాగే జీవశాస్త్రరంగం విషయానికొస్తే..పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించడానికి ,వ్యాధి నిర్థారణకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ వైద్య పరిశోధనలు , సృజనాత్మకత విమర్శనాత్మక ఆలోచన జీవశాస్త్రవేత్తలకు అత్యంత కీలకమని, ఆ లక్షణాలు కొత్త సాంకేతికతకు మనుషులకున్న స్థాయిలో లేదని ఓ సందర్భంలో ఉన్నారు.

ఇదిలా ఉంటే గతంలో భారత ప్రధాని మోడీ కూడా ఏఐ ఆందోళన గురించి మాట్లాడుతూ..ఈ సాంకేతికత వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి.దాంతో ఉద్యోగాలు పోతాయనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి.చరిత్ర చూస్తే ..పని ఎప్పుడూ ఉంటుంది. అయితే పని చేసే పద్ధతిలో మార్పులు వస్తుంటాయి. కొత్త రకం ఉద్యోగా సృష్టి జరుగుతోంది.వాటిని అందిపుచ్చుకోవడం స్కిల్లింగ్‌ ,రీ స్కిల్లింగ్‌ అవసరం. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నతావకాశాలుంటాయని వెల్లడించారు.

Also Read: Bombay High Court: భార్య అలా బెదిరించినా విడాకులు తీసుకోవచ్చు: హైకోర్టు

Also Read:BIG BREAKING: మహాత్మ గాంధీ యూనివర్సిటీలో భారీ అగ్నిప్రమాదం

ai | bill-gates | jobs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు

పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

New Update
Earthquakes

భారత్‌తోపాటు చుట్టుపక్కల దేశాల్లో వరుస భూకంపాలు వణుకు పుట్టిస్తున్నారు. ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఇండియాలోని మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 2 గంటలకు భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో మరో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

శాస్త్రవేత్తలు బలూచిస్థాన్‌కు 65 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్, చైనా భారత్‌లోని మేఘాలయ, కోల్‌కత్తా, ఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అంతేకాదు త్వరలో ఇండియాలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని కూడా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment