అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో చూశారా ?.. 'ఆర్టెమిస్‌-2' మిషన్ తీసిన దృశ్యాలు వైరల్

చంద్రుని వద్దకు మానవులను చేర్చే లక్ష్యంతో నాసా చేపట్టిన 'ఆర్టెమిస్‌-2' మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అంతరిక్షం నుంచి వ్యోమనౌక భూమికి సంబంధించి అద్భుతమైన దృశ్యాలను తీసింది. ఇందులో మన భూమి నీలిరంగు నెలవంకలా కనిపిస్తోంది.

New Update
NASA's Artemis II Captures Stunning Crescent Earth From Space After Launch

NASA's Artemis II Captures Stunning Crescent Earth From Space After Launch

చంద్రుని వద్దకు మానవులను చేర్చే లక్ష్యంతో నాసా చేపట్టిన 'ఆర్టెమిస్‌-2' మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములతో ఓరియన్ క్యాప్సూల్ నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది చంద్రుడి దిశగా తన ప్రయాణంలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఓరియన్‌లోని సోలార్ అరే కెమెరా అంతరిక్షం నుంచి భూమికి సంబంధించి అద్భుతమైన దృశ్యాలను తీసింది. ఇందులో మన భూమి నీలిరంగు నెలవంకలా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: దేశభక్తిని చాటుకున్న సీమా హైదర్‌.. కొడుకుకు 'భరత్' అనే పేరుతో నామకరణం

ఇక వివరాల్లోకి వెళ్తే.. 10 రోజుల పాటు సాగనున్న ఈ చారిత్రాత్మక యాత్రలో ముగ్గురు అమెరికన్లతో పాటు ఓ కెనడా వ్యోమగామి ఉన్నారు. వీళ్లు చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి, దాన్ని చుట్టి మళ్లీ భూమికి తిరిగివస్తారు. కానీ ఈ మిషన్‌లో భాగంగా ఆస్ట్రోనాట్స్‌ చంద్రుడిపై కాలు పెట్టారు. కానీ భవిష్యత్తులో జరగబోయే భారీ అంతరిక్ష యాత్రల కోసం రాకెట్ సామర్థ్యాన్ని, వ్యోమనౌకలోని టెక్నికల్ వ్యవస్థల పనితీరును లోతుగా విశ్లేషిస్తారు. తద్వార భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలో చంద్రుడిపైకి మానవులను పంపించడాన్నే నాసా లక్ష్యంగా పెట్టుకుంది. 

Also Read: విజయ్‌కు బిగ్‌షాక్‌.. నామినేషన్లు చెల్లవా ?.. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు

గతంలో చంద్రునిపై నాసా వ్యోమగాములు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 50 ఏళ్ల తర్వాత మానవును చంద్రుడి కక్ష్యలోకి వెళ్లడంతో 'ఆర్టెమిస్-2'పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అంతరిక్షం నుంచి ఓరియన్ పంపుతున్న ఈ తాజా చిత్రాలు అంతరిక్ష పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మొత్తానికి ఈ అంతరిక్ష యాత్ర సక్సెస్ అయితే ఆర్టిమెస్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మానవులు కాలుమోపేలా చేస్తామని నాసా చెబుతోంది.  ప్రస్తుతం చూసుకుంటే ఓరియన్ వ్యోమనౌకలో అన్ని సిస్టమ్‌లు ఆశించిన స్థాయిలోనే పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు