Musk: గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారు..మెయిల్‌ చేయాలన్న మస్క్‌!

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రపంచ కుబేరుడు మస్క్‌ పెద్ద షాకే ఇచ్చారు.గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్‌ పాయింట్ల రూపంలో చెప్పాలని ‘యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ పంపిన మెయిల్‌లో ఆదేశించారు

New Update
Elon musk

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రపంచ కుబేరుడు మస్క్‌ పెద్ద షాకే ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మస్క్‌.. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20 లక్షల మందికి పైగా ఫెడరల్‌ ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ పంపించారు. గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్‌ పాయింట్ల రూపంలో చెప్పాలని ‘యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌  నుంచి శనివారం పంపిన మెయిల్‌లో పేర్కొన్నారు.

Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!

సవివరమైన సమాచారం, లింకులు లేదా అటాచ్‌మెంట్లు పంపొద్దని ఆ మెయిల్‌ లో స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. జవాబు ఇవ్వడంలో విఫలమైన వారిని రాజీనామా చేసినట్లుగానే పరిగణిస్తామని మస్క్‌ గట్టిగానే తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు  సోషల్‌ మీడియాలో వెల్లడించారు. 

Also Read: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

ప్రత్యేక ప్రభుత్వ అధికారిగా, అధ్యక్షుడి సలహాదారుగా ఉన్న మస్క్‌కు ఫెడరల్‌ ఉద్యోగులను తొలగించే అధికారాలేమీ లేవని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అమెరికాకు చెందిన అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ జాతీయ అధ్యక్షుడు ఎవెరెట్‌ కెల్లీ దీనిపై స్పందిస్తూ.. ట్రంప్‌ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్‌ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని చెప్పారు.

మస్క్‌ పంపిన మెయిల్‌ చాలా క్రూరంగా ఉందని అన్నారు. ఆయన ఆదేశాలతో ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయతీగా ప్రజలకు సేవ చేయని మస్క్‌తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అంటే వారిని అగౌరవపరచడమేనని అన్నారు. మరోవైపు, మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్‌ సంతకం చేశారు. 

ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టడంతో పాటు, అవసరమైన మేరకే నియామకాలు చేపట్టాలని అందులో చెప్పారు. అనంతరం డోజ్‌ పనితీరును ట్రంప్‌ ప్రశంసించారు. మస్క్‌ చాలా మంచి పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయన మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, ‘ఈ వారంలో మీరేం పని చేశారు?’ అనే ప్రశ్న మస్క్‌ తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా అడిగిన విషయం తెలిసిందే.

2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసేముందు ఆ సంస్థ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు ఇదే ప్రశ్నను సంధించారు. అనంతరం ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

అవసరం లేదు: కాశ్‌ 

మస్క్‌ పంపిన మెయిల్‌పై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ కు 9వ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కాశ్‌ పటేల్‌ కాస్త భిన్నంగా స్పందించారు. ఆ మెయిల్‌కు స్పందించవద్దని ఎఫ్‌బీఐ సిబ్బందికి స్పష్టం చేశారు. ‘‘ఏం పనిచేస్తున్నారో తెలియజేయాలంటూ ఓపీఎం నుంచి ఎఫ్‌బీఐ ఉద్యోగులకూ మెయిల్‌ వచ్చి ఉండొచ్చు. ఎఫ్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం దర్యాప్తు సంస్థలో సమీక్షల ప్రక్రియ జరుగుతోంది. ఏదైనా సమాచారం అవసరమైతే మేమే స్పందిస్తాం. 

ప్రస్తుతానికి ఉద్యోగులెవరూ మస్క్‌ మెయిల్‌కు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కాశ్‌ ఎఫ్‌బీఐ ఉద్యోగులకు సందేశం పంపారు. అలాగే జాతీయ భద్రతా సంస్థ కూడా.. తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎవరూ మస్క్‌ మెయిల్‌కు స్పందన తెలియజేయనక్కర్లేదని ఉద్యోగులకు సందేశం పంపించింది.

Also Read: Horoscope: నేడు ఈ రాశివారు చెప్పుడు మాటలకు దూరంగా ఉంటే మంచిది!

Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment