Trump-Musk: మా అనుమతి లేకుండా మస్క్‌ ఏ పని చేయలేరు!

ట్రంప్‌ ప్రభుత్వాన్ని మస్క్‌ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో..మా అనుమతి లేకుండా మస్క్‌ ఏమీ చేయరు..చేయలేరు కూడా ..! అని ట్రంప్‌ అన్నారు.

New Update
trump-musk

trump-musk

America : అమెరికాలో డిపార్ట్‌ మెంట్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సి శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఓ ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి అని వైట్‌ హౌస్‌ ఇప్పటికే పేర్కొంది.అయితే ట్రంప్‌ ప్రభుత్వాన్ని మస్క్‌ వెనుకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:  America: అక్రమ వలసదారులతో భారత్‌ కు పయనమైన అమెరికా విమానం!

అందుకు అనుగుణంగానే టెస్లా అధినేత సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్ట్‌ లు కలవరపెడుతున్నాయి. ఈపరిణామాల వేళ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మస్క్‌ ప్రభుత్వ పరంగా సొంత నిర్ణయాలు తీసుకోలేరని తెలిపారు. మా అనుమతి లేకుండా మస్క్‌ ఏ పని చేయరు..చేయలేరు కూడా ..! అంటూ ట్రంప్‌ విలేకరులతో పేర్కొన్నారు.

Also Read:  Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

Elon Musk - Donald Trump

అధ్యక్షుడి కోసం పని చేసే ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి మస్క్‌ అని వైట్‌ హౌస్‌ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రభుత్వ ఈ మెయిల్‌ చిరునామాతో పాటు వైట్‌ హౌస్‌ లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆయన ఈ విధులకు ఎలాంటి జీతం తీసుకోవడం లేదని తెలిపారు.

ఈ సారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్‌ మస్క్‌ దగ్గరుండి ట్రంప్‌ (Donald Trump) నకు సంపూర్ణ మద్దతు అందించిన సంగతి తెలిసిందే. స్వయంగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌..తన పాలకవర్గంలోకి మస్క్‌ ను తీసుకున్నారు.డోజ్‌ కి సారథిగా నియమించారు.ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు.

అయితే ఆయన పాలనలో మస్క్‌ జోక్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

Also Read: Jaya Bachchcan: తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారంటూ జయబచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు