/rtv/media/media_files/2026/02/23/fotojet-43-2026-02-23-16-04-33.jpg)
Followers are outraged by the death of a mafia don
తన డ్రగ్స్ వ్యాపారంతో మెక్సికోతో పాటు, అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారిన డ్రగ్స్ ముఠా(drugs-party) డాన్ ఎల్ మెంచోను ఆర్మీ మట్టుపెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఎల్ మెంచో అనుచరులు, పలువురు డ్రగ్స్ ముఠాల నాయకులు దేశవ్యాప్తంగా రెచ్చిపోయారు. మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి దిగడంతో మెక్సికో అట్టుడుగుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో డాన్ అనుచరులు అల్లకల్లోలం సృష్టించారు. వాహనాలకు నిప్పుపెట్టడం, రోడ్లను ధ్వంసం చేయడం, దుకాణాలకు నిప్పంటించడం వంటి చర్యలతో మెక్సికో వ్యాప్తంగా భయాందోళనలు చోటు చేసుకున్నాయి. హలిస్కో రాష్ట్ర రాజధాని గ్వాదలహారాలో అల్లరి ముఠాలు విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో గ్యాంగ్ సభ్యులు రోడ్లమీదకు వచ్చి బహిరంగంగా కాల్పులకు తెగబడ్డారు. పెట్రోల్ బంక్‌లు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లకు నిప్పు పెట్టడంతో దేశమంతా పొగ చూరుకున్నది. అల్లరిమూకలు ప్రజా ఆస్తులకు నష్టం చేకూరుస్తుండటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మెక్సికో అధ్యక్షురాలు వెల్లడించారు.
Pray for Mexico pic.twitter.com/aIlvfONluW
— Jeddy0xETH (@Jeddy0xETH_) February 23, 2026
Also Read : ఇరాన్లో భారతీయులకు కేంద్రం బిగ్ అలర్ట్.. ‘ఎలాగైనా ఇండియా వచ్చేయండి’
Mexico Is In Turmoil
డ్రగ్స్ మాఫియా కింగ్, కరుడు గట్టిన నేరస్తుడిగా ముద్ర పడిన ‘ఎల్ మెంచో’ హలిస్కో రాష్ట్రంలోని తపాల్పా ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలు చుట్టు ముట్టడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో నలుగురు అనుచరులు కూడా మృతి చెందడంతో పాటు మరో ఇద్దరిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. అయితే కాల్పుల్లో గాయపడిన ఎల్ మెంచోను మెక్సికో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఎన్ కౌంటర్ సందర్భంగా డ్రగ్స్ ముఠా నుంచి పలు వాహనాలు, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. కాగా ఎల్ మెంచో మరణించాడని తెలియడంతో అతని అనుచరులు విధ్వంసానికి తెరతీశారు. తమ నాయకుడిని చంపేశారన్న కోపంతో అతడి ముఠా సభ్యులు హింసకు దిగారు. దుకాణాలకు నిప్పు పెట్టడం, వాహనాలను దగ్ధం చేయడం వంటి ఘటనలతో మెక్సికో అల్లకల్లోలంగా మారింది. నిందితులు ఒక ఎయిర్‌పోర్టులోకి కూడా చొరబడి అరాచకం సృష్టించారు. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. భారీ పొక్లెయిన్లతో అల్లరి మూకలు రోడ్లను తవ్వుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభుత్వ అలెర్ట్ అయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బమ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. - drugs-seized
CARTELS CONTINUE TO WREAK HAVOC IN MEXICO AS GAS STATION IS SET ABLAZE pic.twitter.com/pOah7NPK1g
— Real America's Voice (RAV) (@RealAmVoice) February 22, 2026
Also Read : అమెరికా, ఇరాన్ యుద్ధం..ఖమేనీ అంతానికి అమెరికా ప్లాన్?
ఇంతకీ ‘ఎల్ మెంచో చరిత్ర ఏంటో తెలుసా?
కరుడు గట్టిన నేరస్తుడిగా మారిన ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఒసెగుయెరా సెర్వాంటెస్. మెక్సికో దేశం మిచోకాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో 1966లో పుట్టాడు. ఆ ప్రాంతంలో అవకాడోతో పాటు గంజాయి, నల్లమందు వంటివి ఎక్కువగా పండిస్తుంటారు. బాల్యంలో అవకాడో పొలాల్లో పనిచేసిన మెంచో.. ఆ తర్వాత 1980 దశకంలో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ అగ్రరాజ్య పోలీసులకు దొరికిపోయాడు. దీంతో అతనికి జైలు శిక్ష పడింది. అనంతరం అతడిని అమెరికా తిరిగి మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు పోలీసుగా ఉద్యోగం కూడా చేశాడు. అలా చేస్తూనే డ్రగ్ మాఫియా కాంటాక్టులు సంపాదించాడు. అలా నెమ్మదిగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
🇲🇽 | ÚLTIMA HORA: Sicarios toman el aeropuerto de Guadalajara tras la caída de "El Mencho". pic.twitter.com/gU2g4kR7mI
— Alerta Mundial (@AlertaMundoNews) February 22, 2026
మెక్సికోలో డ్రగ్స్ వ్యాపారం చాలా ఎక్కువ.. అక్కడ పలు ముఠాలు ఈ డ్రగ్స్ ముఠాలో ఉన్నాయి. ఎల్మెంచో కూడా మొదట మెక్సికోలో శక్తిమంతమైన సినావోలా డ్రగ్ కార్టెల్‌కు చెందిన ముఠాలో చేరాడు. కొంతకాలం అక్కడ పనిచేసి బయటకువచ్చి 2009లో సొంతంగా జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముఠా గత కొన్నేళ్లుగా అమెరికాకు ఫెంటనిల్ వంటి ప్రమాదకర డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తోంది. డ్రగ్ సరఫరా ఒక్కటే కాదు.. ఈ ముఠా దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యల వంటి అనేక నేరాలతో సంబంధం కలిగి ఉంది. 2015లో కేవలం ఆరు వారాల సయమంలో 20 మందికి పైగా పోలీసులను తలలు నరికి అత్యంత కిరతకంగా హత్య చేసింది.
కాగా మెక్సికో(Mexico Cartel Violence) లో డ్రగ్ కింగ్‌పిన్ గా పేరున్న ‘ఎల్ చాపో’ తర్వాత అంతటి అత్యంత శక్తిమంతమైన క్రిమినల్ బాస్‌గా ‘ఎల్ మెంచో’ మారాడు. అయితే, చాపో తరహాలో మీడియా సెలబ్రిటీలా కాకుండా.. అజ్ఞాతంలో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాడు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే తలదాచుకునేవాడు. గతంలో రెండుసార్లు మెక్సికో దళాలకు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విడుదల చేస్తూ అధికారులు, శత్రువులను భయపెట్టేవాడు. రాజకీయంగా కూడా అతడికి పలువురు నాయకుల అండదండలు కూడా ఉన్నట్లు చెబుతారు. ఎల్ మెంచో కుటుంబ సభ్యులు కూడా అతడి ముఠాలో భాగస్వాములుగా మారారు. అతడి భార్య రోజాలిండా వాలెన్సియా కార్టెల్ ఆర్థిక నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుండగా. కుమారుడు అమెరికాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో పోలీసులకు చిక్కడంతో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. కాగా ఎల్ మెంచోకోసం అనేక ఏళ్లుగా ఆర్మీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఖచ్చితమైన సమాచారంతో చుట్టుముట్టారు. అతనితోపాటు అనుచరులు కాల్పులకు దిగడంతో పోలీసులు ప్రతీగా కాల్పులు జరపడంతో అతను మరణించాడు. అతడిపై 15 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.136 కోట్లు) రివార్డు ఉండటం గమనార్హం.
Follow Us