/rtv/media/media_files/2026/05/07/massive-bus-oil-tanker-collision-in-indonesia-2026-05-07-14-41-23.jpg)
Massive Bus-Oil Tanker Collision In Indonesia, 16 Killed
ఇండోనేషియా(indonasia) లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ట్రక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో 16 మంది సజీవదహనమయ్యారు. బుధవారం మధ్యాహ్నం సుమత్రా ఐలాండ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. లుబుక్లింగ్‌గౌ నగరం నుంచి జాంబీకి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదాన్ని నివారించే క్రమంలో బస్సును కుడి వైపునకు మళ్లించారు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ ట్రక్ బస్సును ఢీకొంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Also Read : ఒబామా సంసారంలో ట్రంప్ టెన్సన్
Massive Bus-Oil Tanker Collision In Indonesia
Shocking bus crash in Indonesia killed 16 people and injured four others.
— Chay Bowes (@BowesChay) May 6, 2026
The crash occurred when a passenger bus collided with an oil tanker truck. pic.twitter.com/6Y1mfuJ4h0
ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవర్, ట్యాంకర్ డ్రైవర్, ఆయన సహాయకుడు సజీవ దహనమయ్యారు. మొత్తం 16 మంది మృతి చెందగా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వీళ్లలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ముగోనో తెలిపారు.
Also Read: విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న గవర్నర్.. ఎవరీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్?
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన చోట బస్సు, ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా కాలిపోయాయి. ఇండోనేషియాలో సరైన భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. గత వారం కూడా జకర్తా సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది మహిళా ప్రయాణికులు మృతి చెందారు.
Follow Us