/rtv/media/media_files/2025/03/13/L3hcSXurCLVrTCcLEBY6.jpg)
Aleksej Besciokov Photograph: (Aleksej Besciokov)
అమెరికాలో భారీ స్కామ్‌కు పాల్పడిన వ్యక్తిని బుధవారం కేరళా పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టోకరెన్సీ మోసానికి పాల్పడినందుకు లిథువేనియకు చెందిన బెస్సియోకోవ్ అమెరికాలో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌గా ఉన్నాడు. అతన్ని కేరళలో అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. నిందితుడు అలెక్సేజ్ బెస్సియోకోవ్, రాన్సమ్‌వేర్, కంప్యూటర్ హ్యాకింగ్, మాదకద్రవ్యాల లావాదేవీలు వంటి లూటీలు చేస్తూ వచ్చే ఆదాయాన్ని లాండరింగ్ చేయడానికి గ్యారంటెక్స్ అనే క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేశాడట.
In a coordinated action with the aid of International Police Cooperation Unit of CBI, Kerala Police have arrested a wanted criminal Aleksej Besciokov of USA from Thiruvananthapuram, who was planning to flee from the country. The Lithuanian citizen AlekseJ Besciokov is wanted by… pic.twitter.com/qSVAHRQMol
— ANI (@ANI) March 12, 2025
US సీక్రెట్ సర్వీస్ ప్రకారం.. బెస్సియోకోవ్ దాదాపు 6 సంవత్సరాల్లో గారంటెక్స్ నడిపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇది అమెరికా ఆంక్షలు ఉల్లంఘించి ఉగ్రవాద సంస్థలు సహా కనీసం $96 బిలియన్ల క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు మనీలాండరింగ్ చేసింది. దీనివల్ల గ్యారంటెక్స్ వందల మిలియన్ల ఇల్లీగల్ మనీ పొందింది. హ్యాకింగ్, రాన్సమ్‌వేర్, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి వివిధ నేరాల్లో డబ్బులు ఈ మనీలాండరింగ్ ద్వారా జరిగాయని అమెరికా పోలీసులు చెబుతున్నారు. అతడు యుఎస్ కోడ్ టైటిల్ 18ని ఉల్లంఘించి మనీలాండరింగ్, యుఎస్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్‌ను ఉల్లంఘించడానికి కుట్ర అంతేకాకుండా లైసెన్స్ లేని మనీ సర్వీసెస్ వ్యాపారాన్ని నిర్వహించాడని అమెరికా ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2022లో అమెరికా అతనిపై ఆంక్షలు విధించింది.
Also read: Paris: బట్టలు లేకుండా రోడ్లెక్కి మహిళల నిరసన.. ఎందుకంటే?
🚨 International Crypto Fraud Bust in India!🚨
— Aonix (@Aonix_ml) March 12, 2025
Authorities have arrested Aleksej Besciokov, a Lithuanian national and co-founder of the cryptocurrency exchange Garantex, in Kerala. Besciokov is wanted by U.S. for facilitating billions in money laundering#CryptoScam #Garantex pic.twitter.com/8WMbDlrOdA
2025 మార్చి రెండో వారంలో అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖకు తాత్కాలిక అరెస్ట్ వారెంట్ అందింది. దీంతో CBI, కేరళ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేసి తిరువనంతపురంలో బెస్సియోకోవ్‌ను అరెస్టు చేశారు.