/rtv/media/media_files/2026/03/05/us-embassy-2026-03-05-11-28-20.jpg)
US-Embassy
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ(ali khamenei) ని అమెరికా సంయుక్త దేశాల సైన్యం హతమార్చిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా పాకిస్తాన్(pakistan) లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. అక్కడి అమెరికా ఎంబసీ(US embassy closed)లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో అత్యవసర సిబ్బంది తప్ప మిగిలిన సిబ్బంది అంతా తమ కుటుంబసభ్యులతో కలిసి వెంటనే స్వదేశానికి వచ్చేయాలని ఆమెరికా ఆదేశించింది.
అదే సమయంలో ఇస్లామాబాద్‌లో అమెరికా ఎంబసీ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. అదే సమయంలో సౌదీ అరేబియా, సైప్రస్, ఒమన్‌లోని అమెరికా ఎంబసీల్లో ఉన్న సిబ్బంది స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అమెరికా అనుమతించింది.
Also Read : నాటో దేశాలపై తొలి దాడి.. తుర్కియేపై బాలిస్టిక్ క్షిపణి అటాక్
ఆయువుపట్టుపై దాడి
అమెరికా(america), ఇజ్రాయెల్ దాడులతో ఏ మాత్రం వెరవని ఇరాన్ ఒక్క క్షిపణితో అమెరికా నిఘా ఆయువుపట్టును దెబ్బతీసింది. ఖతార్‌లోని అల్ ఉదేద్ అమెరికా సైనిక స్థావరంలో ఉన్న అమెరికా నిఘా ఆయువుపట్టుపై ఇరాన్ దాడి చేసింది.ఈ దాడితో అల్ ఉదేద్ ఎయిర్‌బేస్‌లోని రాడార్ వ్యవస్థ ధ్వంసమైంది. ఈ దాడిలో కీలక ‘ఏఎన్/ఎఫ్‌పీఎస్-132 ఫేజ్డ్ అర్రే రాడార్’ వ్యవస్థను పూర్తిగా దెబ్బతింది.ఇరాన్ ఏకకాలంలో ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకదానిని రక్షణ వ్యవస్థ అడ్డుకున్నప్పటికీ, రెండో క్షిపణి మాత్రం రాడార్ వ్యవస్థను ఢీకొనడంతో పేలుళ్లు సృష్టించింది. ప్రపంచ దేశాలనుంచి ఎదురయ్యే దాడులను ముందుగానే నియంత్రించడం కోసం అమెరికా లక్షల కోట్లు వెచ్చించి పలు ప్రాంతాల్లో రాడార్. నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. అవి అందించే సమచారాన్ని విశ్లేషించి సైనిక విభాగాలకు అందించేందుకు అల్ ఉదేద్ స్థావరంలో రూ.10,130 కోట్ల (1.1 బిలియన్ డాలర్లు)తో ఫేజ్డ్ అర్రే రాడార్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడీ వ్యవస్థ దెబ్బతినడంతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పేట్రియాట్, థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు పాక్షికంగా దెబ్బతిన్నాయని సిబ్బంది తెలిపారు.
Also Read : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి.. మిగతా కుటుంబం ఎక్కడ?
Follow Us