/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Layoff.jpg)
Layoffs
టెక్ కంపెనీల్లో గత నాలుగేళ్ల నుంచి అడ్డూ అదుపు లేకుండా ఉద్యోగ కోతలు (Lay Offs) కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పనితీరును మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఈ ఏడాది కూడా కొలువుల్లో భారీగా కోతలు విధించనున్నట్లు ఇప్పటికే పలు అమెరికన్ కంపెనీలు ప్రకటించాయి.
Also Read: Tirumala: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు అరెస్ట్!
ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, వాల్‌మార్ట్, సేల్స్ ఫోర్స్,వర్క్ డే, స్ట్రెప్ లాంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. వాటిలో కొన్ని కంపెనీలు ఈ ఏడాది జనవరిలోనే 49, 795 మంది ఉద్యోగాలను తగ్గించాయి. ఇది 2024 డిసెంబర్ లో తొలగించిన 38, 792 ఉద్యోగాల కంటే దాదాపు 28 శాతం అధికం.
Also Read: Ys Jagan:వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!
అమెరికన్ రిటైల్ వ్యాపార దిగ్గజం వాల్ మార్ట్ (Wall Mart) త్వరలో వందలాది ఉద్యోగులను తొలగించడంతో పాటు నార్త్ కరోలినాలోనని కార్యాలయాన్ని మూసేయాలని ప్రస్తుతం అందులో పని చేస్తున్న సిబ్బందిని ఆర్కాన్సస్, కాలిఫోర్నియాలోని మినీ హబ్ లకు తరలించాలని నిర్ణయించినట్లు ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ డోనా మోరిస్ స్పష్టం చేశారు.
ఇదేవిధంగా త్వరలో దాదాపు 1750 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇవ్వనున్నట్లు దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ వర్క్ డే ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల కమ్యూనికేషన్స్ విభాగంలో అమెజాన్ డజన్ల ఉద్యోగాలను తొలగించగా..అంతర్జాతీయ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ పనితీరు ఆదారంగా ఉద్యోగుల పై వేటు వేయడం ప్రారంభించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని తొలగించనున్నట్లు గత నెలలో ప్రకటించిన మెటా ప్రధానంగా పేలవమైన పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమమవుతున్నాది. దాదాపు 3,600 మంది పై వేటు పడనుంది.వీరిలో 3 వేల మందిని సోమవారమే ఇళ్లకు పంపనున్నట్లు ఆ కంపెనీ నుంచి లీకైన ఓ మెమో వెల్లడించింది.
టెక్ దిగ్గజం గూగుల్ నేరుగా ప్రకటించకపోయినప్పటికీ తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలోని ఆండ్రాయిడ్ , పిక్సెల్, క్రోమ్ ,నెస్ట్,ఫిట్‌బిట్ ఉత్పత్తుల సిబ్బందికి స్వచ్‌చంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. త్వరలో ప్రొడక్ట్, ఇంజినీరింగ్,ఆపరేషన్స్ విభాగాల్లోని దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
Also Read:Horoscope Today:నేడు ఈ రాశి వారికి వాయిదా పడ్డ పనులన్నీ పూర్తై పోతాయి!
బౌన్సర్లను, సెక్యూరిటీ గార్డులను..
భారత్ లోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) నిరుడు అక్టోబర్ లో క్యాంపస్ నియామకాల ద్వారా చేర్చుకున్న 700 మంది ఉద్యోగులను బలవంతంగా గెంటేసింద. అందుకోసం బౌన్సర్లను సెక్యూరిటీ గార్డులను ఉపయోగించిందని, ఎలాంటి ముందస్తు నోటీసులు, నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయంగా ఉద్యోగులను తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్‌ఐటీఈఎస్ ఆరోపించింది. కార్యిక చట్టాలను ఉల్లంఘించడంతో పాటు ఉద్యోగులను బెదిరిస్తున్న ఇన్ఫోసిస్ పై వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.
Also Read:Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!