US-Iran: పాకిస్తాన్‌లో శాంతి చర్చలు.. ఇరాన్‌కు మరోసారి అమెరికా వార్నింగ్

మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరారు.

New Update
JD Vance Warns Iran Not To ‘Play’ US As He Departs For Truce Talks Warns Iran Not To ‘Play’ US As He Departs For Truce Talks

JD Vance Warns Iran Not To ‘Play’ US As He Departs For Truce Talks

మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్(iran us war) మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేము కూడా చర్చల కోసం ఎదురుచూస్తున్నామని.. ఇవి సానుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 

Also Read: లెబనాన్‌పై వెనక్కి తగ్గని ఇజ్రాయెల్..పది నిమిషాల్లో 100 లక్ష్యాలపై దాడులు

JD Vance Warns Iran

ఇరాన్ నేతలు చర్చలకు చిత్త శుద్ధితో ఉంటే మేము సహకరిస్తామన్నారు. ఒకవేళ వాళ్ల తమతో ఆడుకోవాలని చూస్తే.. మా టీమ్ కూడా అదే రీతిలో స్పందిస్తుందని తెలుసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: నెతన్యాహుపై అవినీతి కేసులు.. ఇరాన్ సంచలన ఆరోపణలు

ఇరాన్‌కు చెందిన టీమ్ ఇప్పటికే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. మరికొన్ని గంట్లలో అమెరికా ప్రతినిధి బృందం కూడా రానుంది. ఇరుదేశాల మధ్య ఎలాంటి అంశాలపై చర్చలు జరపుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ చర్చల తర్వాతే ఇరాన్‌-అమెరికా యుద్ధానికి ముగింపు ఉంటుందా ? లేదా మళ్లీ కొనసాగుతుందా అనేది తేలనుంది. ఇప్పటికే శాంతి చర్చల కోసం ఇరాన్ 10 డిమాండ్లు తీసుకొచ్చింది. మరోవైపు అమెరికా కూడా సుమారు 14 ప్రతిపాదనలు చేసింది. మరీ ఈ చర్చల్లో ఇరు దేశాలు ఏ నిర్ణయాలు తీసుకుంటాయో అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే. 

Advertisment
తాజా కథనాలు