/rtv/media/media_files/2026/04/14/fotojet-65-2026-04-14-18-05-48.jpg)
MALACCA STRAIGHT
MALACCA STRAIGHT: హార్మూజ్ జలసంధి విషయంలో ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఐతే ఓ వైపు ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. అమెరికా, ఇండోనేషియా(indonasia) రక్షణ మంత్రుల మధ్య ఓ సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఇది ఇండియాకు కూడా షాకింగ్ విషయం. ఎందుకంటే...డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇండియాకు దగ్గరగా ఉన్న..మలాక్కా జలసంధిపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.
సోమవారం అమెరికా, ఇండోనేషియా డిఫెన్స్ కోపరేషన్ అగ్రిమెంట్ కుదిరింది. ఐతే దీని వెనుక బిగ్ స్కెచ్ ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో ఒకటైన మలాకా జలసంధిని ప్రస్తుతం ఇండోనేషియా నియంత్రిస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో 40% ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ ఒప్పందం కుదిరిన సమయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన వాణిజ్య కారిడార్‌లో అమెరికా తన ఉనికిని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Also Read : ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన ఇటలీ.. రక్షణ ఒప్పందం రద్దు
అసలు ట్రంప్ మలక్కాపై ఎందుకు ఫోకస్ పెట్టారు
ఆర్థిక ప్రాముఖ్యత: హార్ముజ్ ద్వారా కేవలం చమురు వెళ్తుంది. కానీ, మలాకా ద్వారా చమురుతో పాటు కార్లు, చిప్స్, ఫోన్లు.. ఇలా ప్రపంచ వాణిజ్యంలో 40% రవాణా అవుతుంది.
చైనాకు చెక్: చైనా(china) తన 80% చమురు దిగుమతుల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. మలాకాను నియంత్రిస్తే చైనా గొంతు పట్టుకున్నట్లే. దీన్నే చైనా మలాకా డైలమా అంటుంది.
వ్యూహాత్మక పట్టు: ఇది హార్ముజ్ కంటే 9 రెట్లు ఇరుకైనది. ఫిలిప్ ఛానల్ వద్ద కేవలం 3 కి.మీ వెడల్పు మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ పట్టు సాధిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించవచ్చు.
మలక్కా జలసంధి ఎందుకు ఇంపార్టెంట్
హిందూ మహా సముద్రాన్ని తూర్పు, ఆగ్నేయాసియాలతో కలుపుతుంది
ప్రపంచ చమురు రవాణాలో 30% వాటాను కలిగి ఉంది. ఇది హార్ముజ్ కంటే ఎక్కువే
చైనా, జపాన్ దేశాలకు చమురు, LNG సరఫరా అయ్యే ప్రధాన మార్గం
చైనా చమురు దిగుమతుల్లో 80% ఈ జలసంధి గుండానే
మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులకు ఈ మార్గం అత్యంత కీలకం
హార్ముజ్ కంటే మలాకా జలసంధే చైనాకు అతిపెద్ద బలహీనత.
మలాకా జలసంధి చైనాకు బలహీనత అయితే, భౌగోళికంగా దానికి దగ్గరగా ఉండటం భారతదేశానికి బలం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టేందుకు గత అమెరికా అధ్యక్షులు భారత్‌కు మద్దతు ఇవ్వడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టి, ఈ జలసంధిలో అమెరికా ఎలాంటి ఎత్తుగడలు వేయాలన్నా భారత్‌ను కలుపుకుని పోవాల్సిందే.
మలక్కా స్ట్రెయిట్ - ఇండియా రోల్
భారత దేశ వాణిజ్యం(india) లో 55% మలాకా, సింగపూర్ జలసంధి ప్రాంతం గుండానే జరుగుతుంది. చైనాకు అసలు ఆందోళన ఏమిటంటే, ఈ జలసంధి ముఖద్వారం అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొనకు చాలా దగ్గరగా ఉండటమే. పోర్ట్ బ్లెయిర్ నుండి మలాకా జలసంధి చేరుకోవడానికి 24 గంటల కంటే తక్కువ సమయం పడుతుంది.
Also Read : విదేశాల్లో స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తులు ఎంతో తెలుసా ?.. అమెరికా అదుపులో బిలియన్ల డాలర్లు సొమ్ము
సింగపూర్ టెన్షన్.. ఇండోనేషియా ప్లాన్
మలాకా జలసంధి ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్నా..సింగపూర్ దీని ద్వారా బాగా లాభపడుతోంది.
ఒకవేళ ఇండోనేషియా కూడా ఇరాన్ లాగా ఈ మార్గంలో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే, సింగపూర్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అమెరికా ఇక్కడ ఇండోనేషియాను తన వైపు తిప్పుకోవడం వెనుక ఈ చిక్కుముడి కూడా ఉంది
ట్రంప్(Donald Trump) ప్లాన్ ప్రకారం.. మలాకా జలసంధిపై పట్టు సాధిస్తే చైనాను అదుపు చేయవచ్చు. అయితే, అండమాన్ దీవుల సహకారం లేకుండా అమెరికాకు ఇది సాధ్యం కాదు. కాబట్టి, ఈ 'బిగ్ స్కెచ్'లో భారతదేశం అత్యంత కీలకమైన భాగస్వామి కాబోతోంది.
Follow Us